An incident of legend actor sv rangarao

an incident of legend actor sv rangarao

an incident of legend actor sv rangarao

7.gif

Posted: 06/25/2012 03:48 PM IST
An incident of legend actor sv rangarao

     నటుడిగా శిఖరాగ్రానికి చేరిన ఎస్వీ రంగారావుని ప్రేక్షకులందరూ ఓ నటుడిగానే కాదు ... ఓ ఆత్మీయుడుగా కూడా చిరకాలంగా గుర్తుంచుకుంటున్నారు. అంతగా ఆయన అన్ని వర్గాల వాళ్లకి చేరువయ్యారు. అలాంటి ఎస్వీఆర్ వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోను మంచి మనసున్న మనిషి. నిలువెత్తు సంస్కారానికి నిజమైన రూపంలా కనిపించే ఎస్వీఆర్, శివారాధనతో తన పనులు ప్రారంభించేవారు. 4eeషూటింగ్ విరామ సమయంలో కవితలు రాయడం ... బొమ్మలు వేయడం చేసే ఎస్వీఆర్, అంతకన్నా ఏ మాత్రం సమయం దొరికినా వివేకానందా - రామకృష్ణ పరమ హంస రచనలు ఎక్కువగా చదివేవారు.  ఆపదలో ఉన్న వారిని చూసినపుడు వెంటనే స్పందించి తన వంతు సాయం చేసేవారు. అలాంటి ఎస్వీఆర్ కి వేటాడటం అంటే మహా ఇష్టమని తెలుసుకుని ఆయన సన్నిహితులు కొందరు చాలా బాధపడ్డారు. ఆ అలవాటు మానుకోమని చెప్పేవారు. ఆయన తుపాకి  గురి ఎట్టి పరిస్థితుల్లోను తప్పేది కాదు. అందువల్ల ఆయన ఎంతో ధైర్యంగా అడవి మధ్యలోకి  సైతం చొచ్చుకుని వెళ్ళేవారు. ఓ రోజున ఆయన అలా వేటకి వెళ్లినప్పుడు ఓ లేడి పిల్లకి గురి పెట్టారు. అయితే అది తప్పించుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించకుండా ఆయన వైపు అలానే చూస్తుండిపోయిందట. ''నాలాంటి మూగ జీవుల ప్రాణాలు తీయడానికి నీకు మనసెలా వచ్చింది?  నీ జ్ఞానాన్నీ ... ధైర్యాన్ని ఇంతటి క్రూరత్వనికా వాడుతున్నావు''? అని ఆ లేడి పిల్ల అడిగినట్టుగా అనిపించిందట. అంతే... తుపాకి పక్కన పారేసి, నిదానంగా ఆ లేడి పిల్ల దగ్గరకి వెళ్లిన ఆయన, దానిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా ఏడ్చేశారట. ఆ క్షణం నుంచి వేట మానేసిన ఎస్వీఆర్, తన చివరి శ్వాస వరకూ మూగ జీవుల పట్ల దయా ... ప్రేమ చూపిస్తూ వుండేవారట. ఇది ఆ మహానటుడి జీవితంలోని ఓ మరపురాని సంఘటన.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger badsha going italy for shooting
Akkineni nagarjuna and nayana tara new movie love story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles