Allu arjun and puri jagannath movie coming

allu arjun and puri jagannath movie coming

allu arjun and puri jagannath movie coming

5.gif

Posted: 06/20/2012 02:23 PM IST
Allu arjun and puri jagannath movie coming

    3ef స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన ‘దేశ ముదురు' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ప్రస్తుతం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్న పూరి జగన్నాథ్ ఈచిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
     'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత ఎన్టీఆర్ పక్కన నటించడానికి సైన్ చేసిన కథానాయిక శృతి హాసన్, తాజాగా తెలుగులో మరో చిత్రాన్ని అంగీకరించింది. అదే ఈ అల్లు అర్జున్ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం. ఇప్పటికే బన్నీ సరసన నటించడానికి శృతి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.3ee
     ఈ క్రేజీ కాంబినేషన్‌ నిర్మాణ బాధ్యతలను గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూరి, అల్లు అర్జున్ కాంబినేషన్ కావడంతో ఇటు సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
      ప్రస్తుతం అల్లు అర్జున్‌ 'జులాయి' చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శక త్వంలో కె.రాధాకృష్ణ నిర్మాతగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బన్నీ సరసన ఇలియానా నటిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu villan role
Venki mehar ramesh movie shadow shooting disrupt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles