'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా షూటింగు గత రెండు రోజులుగా హైదరాబాదు సారధీ స్టూడియోలో జరుగుతోంది. స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో పవన్ కల్యాణ్ , తమన్నాలపై ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పూరీ జగన్నాథ్ పని పట్ల పవన్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట. స్క్రిప్ట్ పట్ల పూరీకున్న కమాండ్ కి పవన్ అడ్మైర్ అవుతున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా, సినిమా షూటింగు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతోందనీ, పవన్ కల్యాణ్ మంచి మూడ్ తో షూటింగు చేస్తున్నారనీ పూరీ జగన్నాథ్ అంటున్నాడు. తన 'డార్లింగ్' ప్రకాష్ రాజ్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడని పూరీ ఆనందంగా చెబుతున్నాడు. మొదట్లో ప్రకటించినట్టుగా చిత్రాన్ని అక్టోబర్ 18 న రిలీజ్ చేస్తామని పూరీ జగన్నాథ్ మరోసారి మాట ఇస్తున్నాడు!
ఇదిలా ఉంటే.. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం గురించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కరీనా కపూర్ ఓ ఐటం నెంబర్ చేయబోతుందనేది ఆ వార్త సారాంశం. ఈ విషయమై దర్శక నిర్మాతలు కరీనాని సంప్రదించడం ... ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని ప్రచారం జరుగుతోంది. తన కెరియర్ ప్రారంభంలో 'తొలిప్రేమ' ... 'ఖుషీ' చిత్రాల రీమేక్ లలో కరీనా నటించింది. అంతేకాదు, ఆ సందర్భంగా ఆమె ఆ ఒరిజినల్ సినిమాలు చూడటం ... పవన్ యాక్టింగ్ ని ప్రశంసించడం జరిగాయి. ఈ అభిమానంతోనే ఆమె ఈ సినిమాలో ఐటం నంబర్ కాగా, ఎస్.జె. సూర్య కూడా తను నటిస్తూ తెరకెక్కిస్తోన్న 'ఇసై' తమిళ చిత్రంలో కరీనాతో ఓ ఐటం నంబర్ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కరీనా కథానాయికగా హిందీలో 'ఖుషీ'ని తెరకెక్కించింది సూర్యానే. ఈ పాట చేయడానికి కరీనా ఆసక్తి చూపుతోందనీ, అయితే ముందుగా పాట తనకి నచ్చాలనీ కండిషన్ పెట్టిందట. దాంతో, ఇప్పుడీ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా అయిన సూర్యా ఓ మాంచి మసాలా నెంబర్ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more