Mahesh do like young tiger

mahesh do like young tiger

mahesh do like young tiger

15.gif

Posted: 06/14/2012 08:08 PM IST
Mahesh do like young tiger

     ఎన్టీఆర్ తో దమ్ము సినిమా చేయటానికి ముందు.. దర్శకుడు బోయపాటి శ్రీను దాదాపు పది కథలు పైగా చెప్పారు. ఆయన చెప్పిన కథ మొదట్లో ఏదీ ఎన్టీఆర్ కి నచ్చలేదు.ఇప్పుడదే సమస్య మహేష్ నుంచి బోయపాటికి ఎదురు అవుతున్నట్లు సమాచారం.nt_fe బోయపాటి శ్రీను చెప్పిన కథ మహేష్ కి నచ్చక మార్పులు తెలిపాడని తెలుస్తోంది.అయితే చిత్రంగా మహేష్ కోసం చేసిన  కథ రామ్ చరణ్ కి నచ్చిందని సమాచారం. రామ్ చరణ్ తో ఈ కథతో ముందుకు వెళ్లిపోవటమా లేక మహేష్ చెప్పిన మార్పులుతో కథ తయారు చేయటమా అనే డైలమాలో మహేష్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక బోయపాటి శ్రీను.. ఎన్టీఆర్ తో చేసిన దమ్ము చిత్రం భాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ తేలకపోయింది.దీనివల్ల కూడా మహేష్ బోయపాటితో  సినిమా కోసం ఆసక్తి కనబరచటం లేదని సమాచారం..బోయపాటి మాత్రం మహేష్ ని వదిలేలా లేడని ఫిలింనగర్ సమాచారం..
     ఇదిలా ఉండగా,  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబందించిన కథా చర్చలు జరుగుతుండగా హరీష్ శంకర్ చెప్పిన కథకి maheఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కథలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నారు హరీష్ శంకర్. హరీష్ శంకర్ చెప్పిన ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చినట్లు కథలో కొద్దిగా మార్పులు చేయమని కోరగా హరీష్ శంకర్ అంగీకారం తెలిపి అదే పనిలో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా శృతి హాసన్ హీరొయిన్ గా నటించే అవకాశం ఉంది.
      కాగా,  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో వస్తున్న ” బాద్షా ” చిత్రం కోసం వీళ్ళిద్దరూ చాలా కలిసికట్టుగా పని చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఈ చిత్రాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాటలు , డైలాగ్స్ మరియు లోకేషన్స్ కోసం చాల సమయం కేటాయిస్తున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన రామ్ చరణ్ పెళ్ళికి ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి వచ్చారు, వారితో పాటు అదే కార్లో శ్రీను వైట్ల కూడా వచ్చారు. జూలై నుంచి ఇటలీలో షూటింగ్ ప్రారంభం కానున్న ‘బాద్షా’ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనుంది. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ ఫై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramchran wedding reception movements
Samantha call sheets to shankar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles