Urvasi saradha birthday today

urvasi saradha birthday today

urvasi saradha birthday today

9.gif

Posted: 06/12/2012 04:00 PM IST
Urvasi saradha birthday today

      శారద పేరు వినబడితే.. వెన్నెల్లో జాబిల్లిలా వెండి తెరపై వెలుగులు విరజిమ్మిన అభినయ ఊర్వశి కనిపిస్తుంది. తెలుగు తెరపై పేరుమోసిన ప్రతి నాయకులకి సైతం, తన డైలాగ్ డెలివరీతో ముచ్చెమటలు పట్టించిన కథానాయిక ఆమె. తెరపై మహిళా పోలీస్ ఆఫీసర్ గా శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించిన ఘనత ఆమె సొంతం. 3efఅలా నవరసాలకు  నమూనాగా నిలిచిన శారద, తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ - హిందీ చిత్రాల్లో 5 దశాబ్దాలకి పైగా తిరుగులేని నటీమణిగా వెలుగొందారు.  శారద అసలుపేరు సరస్వతీ దేవి, ఆమె 1945 జూన్ 12 న జన్మించారు. శారద ఓ వయసుకి వచ్చేనాటికి ఆమె నటన పట్ల ఇష్టం పెంచుకున్నారు. అయితే అప్పట్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడం ... నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ  విషయమేమీ కాదు. ప్రతిభగల కళాకారుల కోసం అన్వేషిస్తోన్న చిత్ర పరిశ్రమకి శారద తారసపడింది. ఆనాటి పరిశ్రమ వేరు ... అప్పటి పరిస్థితులు వేరు. ఏ సంస్థ కూడా ఎవరినీ పిలిచి నేరుగా హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చేది కాదు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకున్న వారిలో ఏ కొద్ది మందినో అరుదైన అవకాశాలు పలకరించేవి ... అదృష్టాన్ని తోడు చేసుకుని అగ్ర కథానాయికగా నిలబెట్టేవి. శారద కూడా అదే బాటలో తన నటనా ప్రయానణాన్నిమొదలు పెట్టారు.
       ఊర్వశి శారద 1960 ల్లో 'తండ్రులు - కొడుకులు' ... 'ఇద్దరు మిత్రులు' ... 'ఆత్మబంధువు' సినిమాల్లో నటించారు. ఇక ఆ తరువాత ఆమెకి ఇటు తెలుగులోనూ ... అటు తమిళ్ లోను అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. 'తోబుట్టువులు' ... మురళీకృష్ణ' ... 'దాగుడు మూతలు' చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలను పోషించిన శారద, 'మనుషులు మారాలి' చిత్రంతో తన కెరియర్ గ్రాఫ్ నే మార్చేసుకున్నారు. 1970 లలో 'సిసింద్రీ చిట్టిబాబు' ... 'చెల్లెలి కాపురం' చిత్రాలు పరిగెత్తుకుంటూ వచ్చి శారదని పలకరించాయి. కథానాయికగా కావాల్సినన్ని మార్కులని సంపాదించి పెట్టాయి. ఇక ఈ దశకం ఆరంభంలో వచ్చిన 'మానవుడు దానవుడు' చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించి, ప్రేక్షకుల హృదయాల్లో ఆమెకి చెరగని స్థానాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె ప్రేమానురాగాలు పంచే ఇల్లాలిగా అత్యంత సహజమైన హావభావాలను ఆవిష్కరించారు. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన 'కాలం మారింది' ... మాయదారి మల్లిగాడు' ... 'బలిపీఠం'  ... శారద విజయ పరంపరలో చేరాయి. 'బలిపీఠం' అఖండ విజయానికి ఆనవాలుగా నిలిస్తే ... 'నిమజ్జనం' అసమానమైన ఆమె అభినయానికి తార్కాణంగా నిలిచింది ... అవార్డుల వర్షాన్ని కురిపించింది.
      3eef 'గోరింటాకు' సినిమా తరువాత ఆమె నటించిన 'సర్దార్ పాపారాయుడు' చిత్రం ఆంద్రదేశంలోని వాడవాడలా విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన సీత పాత్రకి ప్రేక్షకులు అభిమాన హారతులు పట్టారు. ఇక 'జస్టీస్ చక్రవర్తి' ... 'చండ శాసనుడు' ... 'జస్టీస్ చౌదరి' చిత్రాలు శారద నవరస నట పోషణకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఇక శారద కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన చిత్రం 'స్వాతి'. సమాజానికి సందేశాన్ని ఆవిష్కరించిన ఈ సినిమాలో ఆమె సుహాసిని  తల్లిగా శాంత - కరుణ రసాలను అద్భుతంగా పండించారు.  శారద అంటేనే ఎమోషన్ అనేవారు లేకపోలేదు ... అలాంటి వారి అభిప్రాయానికి 'ప్రతిధ్వని' చిత్రం ప్రతీకగా నిలిచిందని చెప్పొచ్చు. ఇక ఆ తరువాత వచ్చిన 'ప్రేమ ఖైది' చిత్రం నుంచి 'యోగి' చిత్రం వరకూ ఆమె పోషించిన ప్రాతి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి పోతుంది. అభినయ సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శారద, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ నట సరస్వతికి ఆంధ్రావిశేష్.కాం శుభాకాంక్షలు చెబుతోంది...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veteran actror suman 30 years telugu film industry
Charan marriage works  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles