Young hero karti new movie biryani

young hero karti new movie biryani

young hero karti new movie biryani

29.gif

Posted: 06/05/2012 03:27 PM IST
Young hero karti new movie biryani

    5  యంగ్ హీరో కార్తీ బిర్యానీ చేసేందుకు సిద్దమవుతున్నాడు. అన్న సూర్యతో పాటు తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నాడీ యంగ్ హీరో.  తమిళ తెరపై తన దైన శైలిలో హవా కొనసాగిస్తోన్న అగ్ర కథానాయకులలో కార్తీ ఒకరు. ఆయన సినిమాలు వరుసగా తెలుగులో అనువాదం కావడం వల్ల ఇక్కడ కూడా ఆయనకి మంచి మార్కెట్టే ఏర్పడింది. తాజాగా ఆయన నటించిన 'శకుని' చిత్రాన్ని ఏకకాలంలో తమిళ్ తో పాటు తెలుగులో సైతం రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయన 'బిర్యాని' అనే చిత్రాన్ని అంగీకరించారు. హీరో అజిత్ కి 'మంగాత్తా' వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. అయితే 'శకుని' తరువాత కార్తీ చేస్తోన్న 'అలెక్స్ పాండియన్', 'ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా' వంటి సినిమాల తరువాత కార్తీ ఈ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ కథలో కార్తీ పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. తెలుగునాట కూడా ఈ సినిమాకు ప్రాధాన్యత కనిపించే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad regional sensor officer transfer
Nagarjuna movies damarukam and siridi sai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles