Prabhas new movie titled rudhra

prabhas new movie titled rudhra

prabhas new movie titled rudhra

17.gif

Posted: 06/04/2012 05:06 PM IST
Prabhas new movie titled rudhra

     1e ఛత్రపతి తన రుద్ర రూపాన్ని మరోమారు చూపించబోతున్నాడు.  ప్రస్తుతం 'రెబల్' సినిమాలో నటిస్తున్న ప్రభాస్, త్వరలో 'రుద్ర' అవతారంలో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వనున్నాడు. ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించే చిత్రానికి ఈ 'రుద్ర' టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ చిత్రానికి 'వారధి' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే, ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా వుండడం కోసం ఈ టైటిల్ని ఇప్పుడు 'రుద్ర'గా మారుస్తున్నారట. ఇందులో ప్రభాస్ పక్కన అనుష్క, రిచా గంగోపాద్యాయ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న 'రెబల్' సినిమా పూర్తికాగానే ఈ 'రుద్ర' చిత్రం షూటింగు ఊపందుకుని, నిర్విరామంగా జరుగుతుందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో  రిచా చాలా సెక్సీగా కనిపించబోతుందట. ఇక ప్రభాస్ విషయానికొస్తే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ కు ఈ సినిమాలో అద్భుతమైన నటనకు ఆస్కారం ఉంటుందని సమాచారం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namita attend a marriage function
Sangeeth celebrations in ram charan marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles