Rajendraprasad latest movie cinimakeldam randi

rajendraprasad latest movie cinimakeldam randi

rajendraprasad latest movie cinimakeldam randi

3.gif

Posted: 06/01/2012 02:40 PM IST
Rajendraprasad latest movie cinimakeldam randi

      5eeఎన్నో హాస్యభరిత చిత్రాలను ప్రేక్షకులకు అందించిన డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ కథానాయకునిగా వస్తోన్న తాజా చిత్రం సినిమాకెళ్దాం రండి.  ఎం.ఎం.జి.రెడ్డి దర్శకత్వంలో శ్రీప్రొడక్షన్స్‌ పతాకంపై సునీత ప్రభాకర్‌, సీత నెక్కంటి నిర్మిస్తున్న ఈ  చిత్రం  జూన్‌ రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. రాజేంద్రప్రసాద్‌ ఇప్పటివరకూ చేసిన కామెడీ చిత్రాలకు పూర్తిభిన్నంగా చాలా వైవిధ్యంగా ఈ చిత్రం రూపొందుతుందని నిర్మాత చెబుతున్నారు. ఈ మూవీలో మాస్టర్‌ భరత్‌ పాత్ర చిత్రణకూడా చాలా ఆసక్తికరంగా ఉండనుందని సమాచారం. ఇందులో వారిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. వీరు చేసే అల్లరి, వేసే వేషాలు చాలా గమ్మత్తుగానూ, థ్రిల్లింగ్‌గానూ ఉంటాయని చిత్ర వర్గాలంటున్నాయి.
      ఒక ఎపిసోడ్‌లో వీరిద్దరూ యమధర్మరాజు, చిత్రగుప్తునిగా కన్పిస్తారు. పూర్తిస్థాయి వాణిజ్యవిలువలతో ప్రేక్షకులను ఆశ్చర్యానందానుభూతులకు గురిచేసే కథాంశమిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా నవరసాల సమ్మేళనం. టైటిల్‌ను బట్టి అందరూ దీన్ని సినిమా నేపథ్యంలో రూపొందిన సినిమాగా భావిస్తున్నారు. కానీ ఇది వేరేతరహా సినిమా. ఇందులో నాలుగు పాటలున్నాయి. అవి ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందాయి. జూన్‌ మొదటివారంలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసి, రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది'' అని దర్శకుడు వెల్లడించారు.
      రవిబాబు, రాజీవ్‌కనకాల, నాగినీడు, రచనామౌర్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌, సమర్పణ: హారిక.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress tapsi agree for any types of films
Another 24 hours entertainment channel coming  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles