నవ్వుల పూలు విరబూయించనున్నాడు యంగ్ టైగర్ బాద్ షా. సాధారణంగా దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలో హీరో క్యారెక్టర్‌కు ఎంత ప్రయారిటీ ఉంటుందో... కామెడీ స్టార్ బ్రహ్మనందం క్యారెక్టర్‌కు అంతే రేంజ్ ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన దూకుడు సినిమాలోనూ హీరో మహేష్ బాబు, బ్రహ్మనందంలపై తెరకెక్కిన కామెడీ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ఇక శ్రీను వైట్ల అప్‌కమింగ్ మూవీ బాద్ షాలోనూ ఎన్టీఆర్-బ్రహ్మనందం మధ్య జరిగే సన్నివేశాలు హైలెట్‌గా ఉండబోతున్నాయని టాలీవుడ్‌లో టాక్. సినిమాలో హీరో ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎన్టీఆర్ బ్రహ్మీపై తెరకెక్కే కామెడీ సన్నివేశాలు కూడా అంతే కామెడీగా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఎన్టీఆర్ బ్రహ్మనందంల కామెడీ జోడీ తెరపై ఇదివరకే నవ్వులు పువ్వులు పూయించింది. గతంలో వీరిద్దరి కలిసి నటించిన అదుర్స్ సినిమాలో వీరి కాంబినేషన్ కామెడీయే సినిమాకు హైలెట్ గా నిలిచింది. చారి.. గురువుగారు అంటూ సాగే వీరిద్దరి మధ్య సంభాషణలు ఆడియెన్స్‌ను మళ్లీ మళ్లీ ధియేటర్లకు రప్పించాయి. ఇక బృందావనంలో ఎన్టీఆర్‌కు డూప్ ఫాదర్‌గా నటించిన బ్రహ్మనందం... మరోసారి అద్భుతమైన కామెడీ పండించాడు. తాజాగా, ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ బాద్ షాలోనూ వీరిద్దరి కాంబినేషన్ స్పెషల్ అట్రాక్షన్ అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎన్టీఆర్-బ్రహ్మనందంల మధ్య కామెడీ సీన్లను శ్రీను వైట్ల తనదైన స్టయిల్లో తెరకెక్కించేందుకు అప్పుడే స్కిప్ట్ రెడీ చేసుకున్నట్టు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ బాద్ షా మరోసారి అదుర్స్ రేంజ్ కామెడీని రిపీట్ చేస్తుందనడంలో సందేహం లేదు. యంగ్ టైగర్ యాక్షన్ ఎపిసోడ్స్ సంగతి ముందునుంచీ తెలిసిందే. రొటీన్ కు భిన్నంగా యంగ్ టైగర్ కామెడీని ఎలా పండిస్తున్నాడో చూస్తుంటే.. చెక్కిలిగింతలు పెట్టేసి.., నవ్వుల పూలు విరబూస్తున్నాడు. అంతేకాదు నేను దేనికైనా సూటైపోతా అని చూపిస్తున్నాడు. దటీజ్ యంగ్ టైగర్...ఎన్టీఆర్...
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more