సీవాసిచె కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ని ఈ రోజు ఉదయం విడుదల చేశారు. ఈ టీజర్ కి అటు వెంకటేష్ అభిమానుల నుంచి ... ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన స్థాయిలో స్పందన లభిస్తోంది. తెలుగు టీవీ చానెల్స్ అన్నీ ఈ టీజర్ని ఎక్కువ సార్లు ప్రసారం చేస్తున్నాయి. అలాగే, ఆయా వెబ్ సైట్లలో కూడా దీనికి ఎక్కువ హిట్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదనాన్ని ప్రతిబింబించే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ... ఆత్మీయతలు - అనురాగాలు ... ఆనందాలు ఇవన్నీ కూడా ఈ సినిమా టీజర్లో కనిపిస్తున్నాయి. అన్నదమ్ములుగా వెంకటేష్ - మహేష్ బాబు ఆదర్శవంతంగా కనిపిస్తుంటే, అల్లరి చేస్తూ సమంతా ... అణకువగా అంజలి కనువిందు చేస్తున్నారు. ముచ్చటైన తెలుగుదనంతో రూపొందించిన ఈ టీజర్ ... ఉమ్మడి కుటుంబంలోని నిండుదనాన్నీ - పండుగదనాన్ని కళ్ళ ముందుంచుతోంది. ఈ టీజర్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందనడంలో అతిశయోక్తి లేదని పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరు పెద్దహీరోలు కలిసి నటిస్తోన్న సినిమాకావటంతో అందరి ద్రుష్టి ఈ సినిమా మీద ఉంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more