నందమూరి బాలయ్యకు అభిమానగణానికి లోటేలేదు. అతన్ని ఫ్యాన్సే కాదు, తోటి సినీరంగంలోని ప్రముఖుల దగ్గరనుంచి, చిన్నా చితకా నటులు, టెక్నీషియన్లు కూడా అమితంగా ఇష్టపడతారు. కల్మషంలేని మనస్తత్వం, ముక్కుసూటిగా పోయే స్వభావం బాలయ్యబాబు స్థాయిని విపరీతంగా పెంచేశాయి. తాజాగా ఇది 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రం ఆడియో వేడుక ద్వారా మరోమారు రూఢీ అయింది. మిగతా హీరోలు ఎవ్వరూ చేయలేని సాహసాన్ని బాలకృష్ణ చేస్తున్నాడని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కితాబు ఇచ్చారు. ఈ వేడుకలో దాసరి.. బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేశారు. 'ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడానికి బాలకృష్ణ ఎలా ఒప్పుకున్నాడా? అని ఆశ్చర్యపోయానన్నారు. ఇదే బాలయ్య బాబు ఘనత. ఇగోలకు ఏమాత్రం తావివవ్వని అతని వైఖరికి అందరినీ ఆకర్షిస్తుంది.
ఆనాడు యన్టీఆర్ తనని ప్రోత్సహించడం కోసం మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటిస్తే, ఈనాడు తన బిడ్డ మనోజ్ ను ప్రోత్సహించడం కోసం బాలకృష్ణ ఇందులో నటించాడని మోహన్ బాబు అన్నారు. అందుకు బాలయ్యబాబుకు ధన్యవాదాలు తెలిపారు మోహన్ బాబు .
బాలకృష్ణ తన పాత్ర గురించి చెబుతూ, 'నా అభిమానులు నా నుంచి ఆశించే దానికి భిన్నంగా ఇందులోని పాత్ర వుంటుంది. మరో ట్రెండ్ సృష్టించే పాత్ర నాది. మేమెప్పుడూ ట్రెండులు సృష్టిస్తుంటాం. మిగతా వాళ్లు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు కూడా మమ్మల్నే ఫాలో అవుతారన్నారు. నాన్నగారు రామారావు గారు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన దారిలోనే మేమూ వెళుతున్నాం' అన్నారు. ఆయన చాలా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. సినిమాలోని కొన్ని డైలాగులు కూడా చెప్పి అభిమానులను అలరించారు. మంచు మనోజ్, లక్ష్మీ, ఇతర చిత్ర ప్రముఖులు తదితరులు మాట్లాడుతూ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రం బాలకృష్ణ గారు నటించటం ద్వారా సినిమా నాణ్యత ఎంతగానో పెరిగిందని ప్రశంసించారు. అదీ.. బాలయ్యబాబు స్టామినా..
ఇక బాలకృష్ణ త్రిపాత్రాభినయంతో భారీబడ్జెట్ చిత్రంగా రూపొందిన 'అధినాయకుడు' మూవీ రేపు విడుదల కాబోతుండటంతో అభిమానులతోపాటు సినీ ప్రియులకు ఆనందం పెల్లుబికుతోంది. నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుని ఈ సినిమా రిలీజ్ కొంచెం ఆలస్యమైన సంగతి విదితమే. పరుచూరి మురళి దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా, విజయం సాధించి కష్టాల కడలిని ఈదుతోన్న నిర్మాతని ఒడ్డున పడేస్తుందని అంతా భావిస్తున్నారు. పెద్దాయన కేరక్టర్‌లో బాలయ్య ఇరవై నిమిషాల సేపు సినిమాలో మెరుపులు మెరిపించబోతున్నాడు. అదే ఈ సినిమా విజయానికి మూలస్థంభం కానుంది. "రికార్డులతో మనకు పనిలేదు. మూడు వేషాలేసే దమ్మున్నోడెవడన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తా. ఎంతోమందికి సమాధానం చెబుతుంది ఈ సినిమా'' అన్న నందమూరి బాలకృష్ణ మాటలు అధినాయకుడి సామర్థ్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి. రేపు వెండి తెరలను తాకనున్న ‘అధినాయకుడు’ కి ఆల్ ద బెస్ట్... ఇండస్ట్రీ.. వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ గలగలలాడాలని కోరుకుందాం...
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more