Balayya adittya 369 coming again

balayya adittya 369 coming again

balayya adittya 369 coming again

23.gif

Posted: 05/24/2012 06:20 PM IST
Balayya adittya 369 coming again

       బాలయ్యబాబు టైం మెషీన్ మళ్లీ సాక్షాత్కరించబోతోంది.  ఒకవేళ టైం మెషీన్ కనిపెట్టగలిగితే.. అందులో ప్రయాణిస్తూ మనం కోరుకునే కాలానికి చేరుకోవచ్చన్న ఊహతో రూపొందిన 'ఆదిత్య 369' చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ మధురానుభూతిని కలిగించిన విషయం ఇంకా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. bala_inn బాలకృష్ణ కథానాయకుడుగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మన సాంకేతిక నైపుణ్యాన్ని చాటి చెప్పింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ (కొనసాగింపు) నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కూడా బాలకృష్ణ కథానాయకుడుగా నటిస్తారనీ, సింగీతం శ్రీనివాసరావు దీనికి దర్శకత్వం వహిస్తారనీ తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, వచ్చే ఆగష్టు నుంచి ఈ చిత్రం షూటింగు మొదలవుతుందనీ అంటున్నారు. ఇందులో నటించే కథానాయిక ఎవరనేది త్వరలో తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన బాలకృష్ణ జన్మదినం రోజున జూన్ 10 న వెలువడే అవకాశం వుంది.  అప్పటి ఆదిత్య 369 లోని పాటలు ఇప్పటికీ ఎంతో మధురానుభూతిని కలిగిస్తాయి. బాలయ్య బాబును సరికొత్తగా చూడబోయే తరుణం ఆసన్న మైందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress karteeka give shocks for
Evadu seetamma vakitlo cirimalle chettu producer dil raju tension  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles