Raja mouli eega release date

raja mouli eega release date

raja mouli eega release date

13.gif

Posted: 05/21/2012 06:29 PM IST
Raja mouli eega release date

      దిగ్గజ దర్శకుడు రాజమౌళి హ్యాండిచ్చాడు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రాఫిక్స్ అద్భుతం “ఈగ” సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ మధ్య ప్రకటించినట్టు ఈ నెల 30న విడుదల కావట్లేదు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. ” ఈగ చిత్రం కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్కరిని ఈ విషయం నిరుత్సాహం కలిగిస్తుంది అని నాకు తెలుసు.raja_eee ఈగ చిత్రం ఈ నెల 30న విడుదల కావట్లేదు అని చెప్పడానికి చింతిస్తున్నాను. నేను కూడా ఈ విషయంలో నిరుత్సాహానికి లోనయ్యాను ఈ చిత్ర గ్రాఫిక్స్ కి పట్టే సమయాన్ని మేము సరిగ్గా లెక్క పెట్టలేకపోయాము ఇప్పటి వరకు చేసిన సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయి మిగిలినవి కూడా అలానే రావాలని అనుకుంటున్నాను ప్రతి ఒకరు పగలు రాత్రి కష్టపడి పని చేస్తున్నారు ఈ చిత్రం ఎంత వీలయితే అంత తొందరగా విడుదల చేస్తాము. నన్ను మన్నిస్తారని అనుకుంటున్నాను” అని రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
      ఇదిలా ఉండగా, ఈగకు గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అప్పుడు అంటూ పలుమార్లు సినిమా వాయిదా పడుతుండటంతో అభిమానులు ఒకింత నిరుత్సాహనికి గురవుతున్నారు.
     ఇక ఈగలో నాని, సమంత, సుదీప్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని సాధారణ ప్రేక్షకులేకాదు సినీ రంగానికి చెందిన అనేక మంది వేచి చూస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madonna wants rahman
Silpa shetty delever a cute baby  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles