Hollywood action hero jackie chan withdraw

hollywood action hero jackie chan withdraw

hollywood action hero jackie chan withdraw

5.gif

Posted: 05/21/2012 12:35 PM IST
Hollywood action hero jackie chan withdraw

      హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. వారందరికీ ఇది ఓ రకంగా చేదువార్తనే చెప్పాలి.  58 ఏళ్ల జాకీచాన్‌ లేటెస్ట్‌‌ యాక్షన్‌ మూవీ చైనీస్‌ జోడియాక్‌. ఇదే తన చివరి యాక్షన్‌ సినిమా అని కాన్స్‌లో జాకీచాన్‌ ప్రకటించారు. ఆక్రోబాటిక్‌ స్టంట్స్‌ చేయడానికి తన వయసు సహకరించడం లేదని చెప్పాడు. ja_eఅందుకే యాక్షన్‌ సినిమాలకు దూరంగా ఉండి... మామూలు క్యారెక్టర్లే చేస్తానని చెప్పాడు. ఏషియన్‌ రాబర్ట్‌ డి నిరోగా మారుతానని చెప్పారు. ప్రపంచంలో హింస పెరిగిపోతోందని.. అందుకే తాను హింసకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. ఆర్మర్‌ ఆఫ్‌ గాడ్‌ సిరీస్‌లో మూడో సినిమా అయిన చైనీస్‌ జోడియాక్‌.. డిసెంబర్‌లో విడుదల కానుంది.
      కాగా జాకీ కుటుంభ నేపధ్యాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే.. చాన్  జీవితం ఎన్నో కష్టనష్టాలతో ప్రారంభమైంది. హంకాంగ్‌లో పుట్టిన జాకీకి చిన్ననాటి నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ప్రాణం. అతని శక్తిసామర్థ్యాలు చూసిన వారంతా జాకీని ముద్దుగా పావోపావో అంటే ఫిరంగి గుండు అని పిలిచేవారు. జాకీ తల్లిదండ్రులు హాంకాంగ్‌లోని ఫ్రెంచ్‌ ఎంబసీలో పని చేసేవారు. జాకీ చదువు కూడా అంతంత మాత్రమే. 1960లో అతని కుటుంబం ఆస్ట్రేలియా వలస వెళ్లింది. అక్కడే జాకీచాన్‌ చైనా డ్రామా అకాడమీలో చేరాడు. పదేళ్ళపాటు మార్షల్‌ ఆర్ట్స్‌‌, ఆక్రోబాటిక్స్‌లో కఠోర శిక్షణ పొందాడు. అనుకున్నది సాధించి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిచాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar rajana as vikrama simha
Amy jackson  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles