Cannes film festival

cannes film festival

cannes film festival

5.gif

Posted: 05/18/2012 01:29 PM IST
Cannes film festival

      ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత గల కేన్స్ చలన చిత్రోత్సవం ఫాన్స్ లో కన్నుల పండువలా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దేశదేశాలకు చెందిన అతిరధమహారధులు హాజరై కళాకండాలుగా నిలిచిన ప్రముఖ చిత్రరాజాలను కనులారా వీక్షించి తరిస్తున్నారు. భారతీయ సినిమాకు సంతోషకర పరిణామమేంటే.. సుప్రసిద్ధ నాట్యాచారుడు ఉదయ్ శంకర్ 1948లో నిర్మించిన "కల్పన'' చిత్రానికి కేన్స్ చలన చిత్రోత్సవంలో అపురూపమైన గౌరవం లభించింది.  చిత్రోత్సవం రెండవ రోజైన గురువారం నాడు ఈ చిత్రాన్ని పత్య్రేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రదర్శనకు పెక్కు మంది సినిమా అభిమానులు సినిమా ప్రారంభం కావడానికి గంట ముందు నుంచే వరుసలో నిలబడి నిరీక్షించారు.cannes 
      1948లో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనదని ఉదయ్‌శంకర్ సతీమణి శ్రీమతి అమలశంకర్ కన్నీళ్లు పర్యంతం అవుతూ వ్యాఖ్యానించారు.  'కేన్స్' అంటేనే తనకు ఎంతో అభిమానం అని, ఉదయ్ శంకర్‌కూ, తమకూ ఫ్రాన్స్ తమ జీవితంలోనూ ఎంతో ముఖ్యమైనదని ఆమె అన్నారు. కళాకారులు, వారి జీవితాలు, కళలో కాసులవేట, దేశ ప్రగతి, ఆ ప్రగతిని నిరోధిస్తున్న వారూ ఇలా అన్ని కోణాలనూ ఉదయ్‌శంకర్ ఈ చిత్రంలో చూపించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఉదయ్‌శంకర్ నిర్మించి, దర్శకత్వం వహించిన 'కల్పన'లో అమలశంకర్ కూడా నటించారు. వీరిద్దరి నృత్యాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.w
       కాగా ఈ చిత్రం ప్రింట్ ఇప్పటి వరకు నేషనల్ ఫిల్మ్ ఆర్కెవ్స్‌లో ఉంది. అయితే చాలా కాలం పాటు ఈ ప్రింటును ఎవ్వరూ పట్టించుకోలేదు.2007లో మార్టిన్ స్కార్సీస్ చొరవతో ఈ చిత్రాన్ని మళ్ళీ పునరుద్ధరించగలిగారు. వరల్డ్ సినిమా ఫౌండేషన్ ఈ చిత్రానికి మళ్ళీ కొత్త జీవకళను ఇచ్చింది. ఇంత అద్భుతమైన చిత్రానికి మళ్ళీ కొత్త జీవం పోసినందుకు మార్టిన్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఉదయ్ శంకర్ కుమార్తె నటి అయిన మమత శంకర్ చెప్పారు.
  ఈ చిత్రోత్సవానికి తల్లీకూతుళ్లు ఇద్దరూ ప్రత్యేకంగా విచ్చేశారు. ఈ 94 ఏళ్ల వయసులో కూడా 'కల్పన' పేరు చెప్పగానే పరుగులు తీస్తూ, సంతోషంగా వచ్చానని అమల అన్నారు. ఇలానే వివిధ దేశాలకు చెందిన చిత్రాల ప్రదర్శనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈనెల 27వ తేదీవరకూ ఈ సినీ పండుగ కొనసాగుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan upasana wedding preparations
Gabbar singh bollywood records  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles