Nandamoori natasimham balayya babu journalism

nandamoori natasimham balayya babu journalism

nandamoori natasimham balayya babu journalism

17.gif

Posted: 05/16/2012 05:26 PM IST
Nandamoori natasimham balayya babu journalism

      కత్తిపట్టి శత్రుసైన్యాన్ని ఊచకోత కోసే పాత్రలే ఎక్కువగా చేస్తోన్న బాలయ్యబాబు ఇప్పుడు కలం చేపట్టబోతున్నాడు. కత్తి కంటే కలం గొప్పదని మన పెద్దలు చెప్పిన విషయాన్ని తనదైన శైలిలో మరోసారి నిరూపించబోతున్నాడు బాలకృష్ణ.bala_ee రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీమన్నారాయణ' చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారన్న విషయాన్ని ఇంతకు ముందే వివరించాం. ఎన్నో స్కాముల్ని వెలుగులోకి తెస్తున్న నేటి పాత్రికేయుడి వ్యక్తిత్వానికి ఈ పాత్ర ప్రతిరూపంలా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఫిలిం సిటీలోని ప్రిన్స్ స్ట్రీట్ లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
      అనంతరం ఈ చిత్ర యూనిట్ యూరప్ పయనమవ్వబోతోంది. త్వరలో యూరప్ లోని అందమైన లొకేషన్లలో మూడు పాటల్ని చిత్రీకరిస్తామని నిర్మాత చెప్పారు. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సరికొత్తగా జర్నలిస్ట్ అవతారమెత్తుతోన్న బాలయ్యబాబు శత్రువులకు కలంతో సమాధానం చెబుతాడో లేక కత్తిని ఉపయోగిస్తాడో అన్నది సస్పెన్సే...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh popular dialogue
Nagarjuna bhai movie report  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles