Sunil and young hero siddarth multi starer movie

sunil and young hero siddarth multi starer movie

sunil and young hero siddarth multi starer movie

15.gif

Posted: 05/15/2012 04:07 PM IST
Sunil and young hero siddarth multi starer movie

      sue ‘వేదం’ సినిమాతో బన్నీ-మంచు మనోజ్ మల్టీ స్టారర్ సినిమాలకు మళ్లీ ఆజ్యం పోసింది మొదలు, తెలుగు చిత్ర సీమలో ఈ తరహా సినిమాలకు ప్రాముఖ్యత లభిస్తోంది. ఈ వాతావరణం ప్రముఖ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ఈ సాంప్రదాయానికి పెద్దపీట వేసిన నేపధ్యంలో ఇలాంటి తరహా మరో సినిమా తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో ఎవరు హీరోలు గా నటించబోతున్నారంటే,  ప్రస్తుతం సోలో హీరోగా నటిస్తున్న హాస్యనటుడు సునీల్,  మరో యువనటుడు సిద్ధార్థ్. suf
        'అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి తయారుచేసుకున్న కథ వీరిద్దరికీ నచ్చడంతో ఈ ప్రాజక్టులో నటించడానికి సునీల్, సిద్ధార్థ్ అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం సిద్దార్థ్, సమంతా జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే, మరోపక్క సునీల్ 'రాధాకృష్ణుడు' చిత్రంలో నటిస్తూ బిజీగా వున్నాడు. ఈ రెండు ప్రాజక్టులు పూర్తయ్యాక సునీల్, సిద్ధార్థ్ కలిసి నటించే చిత్రం ప్రారంభం అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna damarukam movie in trouble
Sruthi hassan about gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles