Evadu movie shooting going on

evadu movie shooting going on

evadu movie shooting going on

35.gif

Posted: 05/06/2012 04:28 PM IST
Evadu movie shooting going on

     evaee రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ “ఎవడు” పై పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఐటం సాంగ్ కోసం రామ్ చరణ్-శ్వేతభరద్వాజ్ పై ఐటం సాంగ్ చిత్రీకరించారు. ఈ పాటకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కేక పుట్టించే మ్యూజిక్ అందించాడట. దాంతో చెర్రీ.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నాడు. ” ఇప్పుడే ఎవడు చిత్రంలో ఐటం సాంగ్ చిత్రీకరణ జరిగింది ఈ పాట చూశాక మీరు ఆశ్చర్యపోతారు. దేవిశ్రీ ప్రసద్ కి థాంక్స్” అంటూ ట్విట్టర్ లో రాసుకున్నాడు.
      ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి సమంత, ఏమి జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.
       ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది. ఆ పాత్ర స్వభావం గురించి గురించి చిత్రయూనిట్ తెలిపింది. గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు తీసేవాడొకడు వస్తాడంటోన్న ఈ మూవీలో చరణ్ సందడిచేయబోతున్నాడన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasekhan and jevitha re entry into congress
Actress pranitha now busy with more films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles