Damarukam release in two months

damarukam release in two months

damarukam release in two months

13.gif

Posted: 05/04/2012 07:44 PM IST
Damarukam release in two months

      ddaaవిభిన్నమైన భక్తి పారవశ్య సినిమా ‘శిరిడీ సాయి’ కోసం ప్రస్తుతం నాగ్ బిజీగా ఉన్నారు. అయితే తాజా వార్తేంటంటే..  కింగ్ నాగార్జున ఢమరుకం మ్రోగించేందుకు సమయం ఆసన్నమైంది. భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయి చాలాకాలం అయినప్పటికీ గ్రాఫిక్స్.. డబ్బింగ్ పనులు చాలా శక్తివంతంగా చేస్తుండటంతో సినిమా రిలీజ్ చాలా ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. నాగార్జున హీరోగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో 'ఢమరుకం' రూపొందుతోంది. దైవశక్తికీ ... దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది.
      ఈ సోషియో ఫాంటసీ.. తాజాగా అందిన సమాచారం ప్రకారం, జూలై మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఆటో డ్రైవర్ గా., పార్వతీ దేవి అంశతో పుట్టిన మహిమగల యువతిగా అనుష్కా., శివుడిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. 'రక్త చరిత్ర' ఫేం అభిమన్యు సింగ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చే వారే కావటంతో మంచి అవుట్ పుట్ వచ్చిందని చిత్ర వర్గాల టాక్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shanvi bags sushanth comeback flick
Sanakhan fire on media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles