Film comedy actor avs give blog buster awards

film comedy actor avs give blog buster awards

film comedy actor avs give blog buster awards

14.gif

Posted: 04/24/2012 04:28 PM IST
Film comedy actor avs give blog buster awards

              ప్రముఖ హాస్య నటడు ఎవిఎస్ అవార్డులిచ్చేటందుకు ఓ నూతన ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా  ఏవీఎస్‌ ఆధ్వర్యంలో 'బ్లాగ్‌ బస్టర్‌ అవార్డ్సు' ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సోషల్‌ నెట్‌వర్క్‌ అయిన బ్లాగ్స్‌ ద్వారా ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందనీ, ఇటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారిగా జరగడం ఆనందంగా ఉందని ఏవీఎస్‌ తెలియజేశారు. 'ఏవీఎస్‌ ఫిలిమ్‌.ఇన్‌' లోనికి వెళితే అవార్డుల గురించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. 2011 సంవత్సరంలో విడుదలైన 114 చిత్రాల్లోని 11 కేటగిరిలకుగాను ఈ అవార్డులు ఇవ్వనున్నట్టు, వీటికి ఐదుగురు జర్నలిస్టులచే కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.avs_awardeeeeees

               ఈ బ్లాగ్ ఓపెనింగ్ కార్యక్రమానికి దర్శక రత్న దాసరి నారాయణ రావు, మురళీమోహన్‌, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ తదితరులు హాజరయ్యారు. 'ఒకప్పుడు పత్రికలు అవార్డులు ఇస్తుండేవి. క్రమేణా టీవీ ఛానళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇంటర్‌నెట్‌ద్వారా అవార్డు ఇవ్వాలనే ప్రక్రియ చాలా కొత్తగా ఉంది' అని అన్నారు మురళీమోహన్.
             దాసరి వ్యాఖ్యానిస్తూ...'నీరసంగా ఉన్న రోగికి ఇచ్చే ఇంజక్షనే అవార్డులు. ఒకప్పుడు అవార్డులకు చాలా గౌరవముండేది. క్రమేణా రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు పైరవీలుచేసి కొందరు తెచ్చుకుంటున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులను పైరవీచేసేందుకు ఓ రాకెట్‌ నడుస్తోంది. ఇటువంటి సమయంలో సోషల్‌నెట్‌వర్క్‌ ద్వారా అవార్డులు ఇవ్వడం సాహసమే అవుతుంది. వీటిని నిస్పక్షపాతంగా ఇవ్వాలని' అని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యానాలు చేయటంలో ఏమాత్రం వెనుకాడని దాసరి మాటలు ఈ దఫా చర్చనీయాంశమయ్యాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger ntr dammu movie doing great business
Heroine kajal clarifies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles