Bollywood beauty karina kapoor acts as jejamma

bollywood beauty karina kapoor acts as jejamma

bollywood beauty karina kapoor acts as jejamma

25.gif

Posted: 04/23/2012 06:12 PM IST
Bollywood beauty karina kapoor acts as jejamma

             Kareena-Kapoor-Bridal-Look_inn బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ని ఇకపై జేజమ్మంటారేమో.. ఎందుకంటే.. టాలీవుడ్ అందాల భామ అనుష్క నటించిన మూవీ 'అరుందతి' తెలుగులో సంచలన విజయం సాధించింది. దీంతో జేజమ్మగా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకుంది అనుష్క. తమిళంలోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ తెరపై కనిపించబోతోంది. ఈ సినిమా హిందీ హక్కుల్ని జెమిని ఫిల్మ్ సర్యూట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అరుంధతిగా అనుష్క పాత్రలో ఎంపిక చేసేందుకు కొంతకాలంగా హీరోయిన్ కోసం వెతికారు. ముందుగా కత్రినాకైఫ్, రాణిముఖర్జీ ఆ పాత్రకోసం రేసులో వున్నారు. తాజా సమాచారం ప్రకారం కరీనాకపూర్ అరుంధతి పాత్రలో నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.
                హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి బాగా ఆసక్తి చూపించే కరీనా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో 'అరుంధతి'గా అనుష్క నటనకి ఫ్లాటయిపోయాననీ, దాని హిందీ వెర్షన్ లో నటించే అవకాశం వస్తే వదులుకోననీ చెప్పింది. అభినయానికి ప్రాధాన్యత వున్న ఇలాంటి పాత్రను పోషించడం ఓ ఛాలెంజ్ లాంటిది. ‘అరుంధతి’ చిత్రం నా కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రమవుతుంది’ అని తెలిపింది. తెలుగులో అఘోరాగా విలన్ పాత్రను పోషించిన సోనూసూద్ అదే పాత్రను హిందీలో చేయబోతున్నాడు. మొత్తంగా కరీనా అరివీరభయంకర రూపాన్ని త్వరలో చూడొచ్చన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Star director rajamouli eega movie will release on
Hero bala krishna new movie in the direction of  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles