Music show on may 26th in hyderabad

music show on may 26th in hyderabad

music show on may 26th in hyderabad

7.gif

Posted: 04/09/2012 03:32 PM IST
Music show on may 26th in hyderabad

        ఆపన్నహస్తం కోరే సంగీత కళాకారులకు మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించేందుకు సిద్దమయ్యారు కొందరు సహ్రుద్భావులు.  సినీ సంగీత కళాకారుల, వృద్ధ సంగీత కళాకారుల అభ్యున్నతి కోసం వారి మేలు కోరుతూ ఆర్థిక సహాయం అందించడానికి సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్స్‌ ముందుకు వచ్చింది. సినీ మ్యుజిషియన్స్‌ ఆధ్వర్యంలో మే 26న మెగా మ్యూజికల్‌ షోను లలిత కళాతోరణంలో ఏర్పాటు చేయనున్నామని అసోసియేషన్స్‌ ప్రకటించింది.show_inn22
         ఎంతోకాలంగా సినీ పరిశ్రమలో సంగీతాన్నే నమ్ముకున్న కళాకారులు, అట్టడగుస్థాయిలోనే ఉన్నారు. అందులో చాలామంది వృద్ధులు కూడా వున్నారు. వారికి మా యూనియన్‌ తరుఫున ఏదైనా సహకారం అందించాలని నిశ్చయించుకున్నాం. అందుకుగాను వచ్చేనెల 26న లలిత కళాతోరణంలో తెలుగు సినీ మ్యుజిషియన్స్‌ అందరి ఆధ్వర్యంలో మెగా మ్యూజికల్‌ షోను నిర్వహిస్తున్నాం. ఈ ఈవెంట్‌లో సంగీత దర్శకులు, ప్లేబ్యాక్‌ సింగర్స్‌ అందరూ పాల్గొంటారు. ఈ ఈవెంట్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని వృద్ధ సంగీత కళాకారులకు, వెనుకబడిన కుటుంబాలకు అందజేస్తాం.
          ఈ కార్యక్రమానికిగాను ఫిల్మ్‌ ఇండిస్టీ పెద్దల నుంచి మంచి స్పందన లభించింది. నిర్మాతలందరూ మాకు సపోర్ట్‌ గా నిలిచారు. అలాగే తెలుగు ప్రేక్షకుల సహాయం కావాలి' అని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆర్.పి పట్నాయక్ తదితరులు తెలిపారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ...'ఈ ఈవెంట్‌ గురించి చక్రి చెప్పగానే, నిర్మాతలందరి తరుఫున మేము కూడా సహకారం చేస్తామని మాటిచ్చాం. ఈ కార్యక్రమం విజయవంతమై నలుగురికి సాయపడేది కావాలని ఆశిస్తున్నానన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress sara sharma opens a optical showroom in hyadeabad
Producer natti kumar critisise 3 movie starer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles