రామ్ చరణ్ - తమన్నా జంటగా నటించిన 'రచ్చ' సినిమా విజయవంతమైంది. ఈ సక్సెస్ వెనుక దర్శకుడు సంపత్ నంది తో పాటు హీరో రామ్ చరణ్ తేజ్, తమన్నా, చిత్ర యూనిట్ కష్టం ఎంతోఉంది. ఎన్నో క్లిష్టమైన సన్నివేశలు చేస్తూ ఈ సినిమాలో చరణ్ పలు మార్లు గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి చివరకి ప్రేక్షకుల మెప్పు పొందగలిగాడు.
'వానా వానా వెల్లువాయే'.. ఇప్పుడీ పాటే ఈ సినిమాకి హైలైట్ గా నిలిచి, అన్నివర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. నాయికా, నాయకుల మధ్య చెలరేగే శృంగార భావాలకు అద్దం పడుతూ ఊపుగా ఉత్సాహంగా సాగి ఆ సినిమా సక్సెస్ లో ఈ పాట ప్రధాన పాత్రను పోషించింది. ఈ పాటకు హీరో హీరోయిన్లు ఎంతో చక్కగా అభినయించి ప్రేక్షకుల మెప్పుకు కారణమయ్యారు. అంతేకాదు, అనేక సందర్భాల్లో డూప్ లేకుండా రామ్ చరణ్ చేసిన యాక్షన్ సీన్స్ ... తమన్నా గ్లామర్, బలమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాలో చరణ్ – తమన్నా ఇద్దరూ చాలా ఫ్రెష్ గా కనిపించేందుకు, చక్కగా అభినయించేందుకు ఎంతో కసరత్తు, పరిశ్రమించారని సినిమా చూస్తే ఇట్టే అవగతమౌతుంది. ''వానా వానా వెల్లువాయే '' పాట ట్రైలర్ కి అనూహ్యమైన స్థాయిలో ఫీడ్ బ్యాక్ రావటం, ముందుగా ఈ సినిమా చూసిన చిరంజీవి 'ఏదైతే చెప్పావో అదే తీశావ్' అంటూ మెచ్చుకోవటం వెనుక అర్థం సినిమా చూశాక అర్థం అవుతుంది. మణిశర్మ సంగీతం, పరుచూరి బ్రదర్స్ మాటలు, ఆనంద్ సాయి సెట్స్ , ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవటంతోపాటు, ఈ చిత్ర విజయంలో యూనిట్ సభ్యుల సమిష్టి కష్టాన్ని చాటి చెపుతున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే అందరూ శ్రమించారీ సినిమా కోసం.
చైనాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'ఐపీ మాన్' సినిమాలోని ఫైట్స్ రామ్ చరణ్ కి విపరీతంగా నచ్చడంతో, చరణ్ ఎంతో తర్ఫీదు పొంది ఆదే తరహా పోరాట సన్నివేశాలను 'రచ్చ' సినిమా కోసం చేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో 'రచ్చ' సినిమా షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ గాయపడ్డాడు. ఈ సినిమాలోని ఓ పాటను ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రేమ రక్షిత్ కంపోజ్ చేసిన ఓ టిపికల్ స్టెప్ ని వేసేందుకు రామ్ చరణ్ ప్రయత్నించగా, అతని కాలికి గాయమైంది. తీవ్ర మైన నొప్పితో బాధ పడిన రామ్ చరణ్ ని పరీక్షించిన డాక్టర్లు అతను ఓ 3 - 4 వారాల పాటు డాన్స్ చేయకూడదనీ ... పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఈ వార్త ఇటు సినిమా యూనిట్ కి అటు అభిమానులకి తీవ్రమైన నిరాశను కలిగించింది.
ఓ వైపున ఈ సినిమా ఆడియోని హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపున అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరో వైపున ఇంకా ఒకటిన్నర పాట చిత్రీకరణ బ్యాలన్స్ ఉండిపోయింది. గాయమైన చరణ్ 'రచ్చ' ఆడియో వేడుకకి వస్తాడో? లేదో? అనే సందేహం ... సినిమా రిలీజ్ మరింత పోస్ట్ పోన్ అవుతుందేమోననే ఆందోళన అభిమానులని కలవరపెట్టింది. అయినా కాని చరణ్ ఆడియో ఫంక్షన్ లో పాల్గొని, ఇంకా ఎన్ని ఎముకలు విరిగినా ఫర్వాలేదు. అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేస్తానని ప్రకటించి అలానే సినిమా పూర్తి చేశాడు.
"అతడు అడుగేస్తే ఆడి... కనిపిస్తే త్రీడీ... షర్ట్ తీస్తే లోపల సూపర్ బాడీ' అనే డైలాగ్ దియేటర్లో క్లాప్స్ కొట్టిస్తుందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్టు ఈ డైలాగ్ మంచి రెస్పాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరో- విలన్ ఎదురెదురు పడినప్పుడు వచ్చే డైలాగులు తూటాల్లా పేలతాయని వారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ “రచ్చ” లో ఆద్యంతం కొత్త కోణంలో కనిపించాడు. చైనా, కేరళ, శ్రీలంక, బ్యాంకాక్ వంటి దేశాలలో తీసిన సన్నివేశాలు అబ్బుర పరిచాయి.
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా విజయవంతమై అందరి కష్టానికి తగిన ఫలాన్ని ఇచ్చిందని చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more