Film actress and politician jayapradha birth day today

film actress and politician jayapradha birth day today

film actress and politician jayapradha birth day today

9.gif

Posted: 04/03/2012 03:24 PM IST
Film actress and politician jayapradha birth day today

             jya_1_innఅందం.. అభినయం కలగలసిన నటి జయప్రద. ఇంటగెలిచి,  రచ్చకూడా గెలిచిన ఆ అందాల తార,  పుట్టినరోజు ఇవాళ.  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుట్టిన లలితారాణి సినీ రంగంలో ప్రవేశించి జయప్రదగా మారారు. ఆమె చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని అనుకునే వారు. అదే జరిగితే కొంత మంది పేషెంట్లకే ఆమె తెలిసి ఉండే వారు. యాక్టర్ అయ్యారు కాబట్టి దేశమంతా అభిమానించే నటి అయ్యారు.
            ‘భూమి కోసం’  చిత్రంతో చిత్రరంగంలో ప్రవేశించిన జయప్రద తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో జయప్రద నటించిన ‘సిరిసిరి మువ్వ’ చిత్రంలో ఆమె నటన అద్భుతం. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంలో జయప్రద నటనకు సినీలోకం నీరాజనాలు పలికింది.
                 గ్లామర్ కథానాయికగా అడవి రాముడు, సింహాసనం, యమగోల, బుచ్చిబాబు వంటి చిత్రాల్లో కనిపిస్తే... నటనపరంగా అంతులేని కథ, మేఘ సందేశం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం వంటి సినిమాలు జయప్రదకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. హిందీ చిత్ర రంగంలో కూడా ప్రవేశించిన జయప్రద అక్కడ కూడా తన నటనతో అగ్ర కథానాయికగా వెలుగొందారు. jayaprahdh_2_inn33
             తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన జయప్రద ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేసి లోక్ సభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. ఐదు పదుల వయసు దాటిన జయప్రద తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్ భారత ప్రజలందరికి అభిమాన నటి. సినీ, రాజకీయరంగాల్లో ఏ  ప్రాంతంలోనైనా భాషా ప్రాంతీయత ను వెనక్కినెట్టి నెగ్గుకురాగలిగిన గొప్పవ్యక్తి జయ అంటూ మెగాస్టార్ చిరంజీవి,  జయప్రదను పొగడుతూ ఉంటారు. ఇంతటి అందానికే అందమైన జయప్రద మరిన్నిజన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆంధ్రావిశేష్.కామ్ ఆకాంక్ష. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush kolaveri d song effect
Mega power star ram charan tej comment on eega movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles