Hero nitin birthday special

nitin, Telugu Actor, nitin Fan comments, fan speak, fan club, fan opinion, views, gossip. Happy Birthday to NithinNews,Telugu movie news, latest news, political news, Updated Movie NewsHappy Birthday to Nithin.

Happy Birthday to NithinNews,Telugu movie news, latest news, political news, Updated Movie News:Happy Birthday to Nithin

Hero nitin birthday special.GIF

Posted: 03/30/2012 01:40 PM IST
Hero nitin birthday special

Nitinతెలుగు సినీ పరిశ్రమలోకి ఎందరో హీరోలు వచ్చి పోతుంటారు. కానీ గత పది సంవత్సరాలుగా జయాపజయాలను లెక్క చేయకుండా మొక్కఓని ధైర్యంతో ముందుకు సాగుతున్న హీరో నితిన్. ప్రముఖ నైజాం డిస్టిబ్యూటర్, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి కొడుకుగా తెలుగు పరిశ్రమకు హీరోగా సరిగ్గా పదేళ్ళ క్రితం పరిచయం అయ్యాడు నల్లాల నితిన్ రెడ్డి. నితిన్ మార్చి 30, 1983లో జన్మించాడు. నేడు అతని 29వ పుట్టిన రోజు. అలాగే సినీ కెరీర్ 10 పుట్టిన రోజు. ఇష్క్విజయంతో దిల్కుష్ గా విక్టరీని సొంతం చేసుకొని... సైఅంటూ సంబరంచేసుకుంటున్న హీరోనితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గత పదేళ్ళులో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఒడిదొడుగుల గూర్చి.....

సరిగ్గా పది సంవత్సరాల క్రితం తేజ దర్శకత్వంలో జయంసినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నితిన్ ఆ సినిమా విజయంతో ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకొన్నారు. తరువాత వచ్చిన సంబరంసినిమా నిరాశ పరిచినా తరువాత రాజమౌళిదర్శకత్వంలో వచ్చిన సై దిల్సినిమాలు హిట్ అవ్వడంతో మళ్ళీ కెరీర్ పుంజుకున్నా, క్రిష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయంసినిమా నుండి నేటి ఇష్క్ ముందు వరకు వచ్చిన సినిమాలు నితిన్ కి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఏడు సంవత్సరాల విరామం తరువాత నితిన్ కి ఇష్క్సినిమా విజయాన్ని అందించింది.

ఇప్పడు నితిన్ పడిలేచిన కెరటం. జీవితంలో ఎన్నో ఒడి దొడుకులను ఎదుర్కొని మంచిNitin-reddy చెడులను చూసిన వాడు. ప్రతి సినిమాకూ ఒకేలా కష్టపడ్డా విజయం మాత్రం దక్కలేదు. ఫ్లాప్‌ను విన్న ప్రతి సారీ బాధపడ్డాడు. అయినా నితిన్ ధైర్యంతో సినీ పరిశ్రమలో ధైర్యంగా నిలదొక్కుకున్నాడు. ఇష్క్సినిమా విజయంతో మళ్ళీ కెరీర్ ప్రారంభించిన నితిన్ త్వరలో ఇదే బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే బెల్లంకొండ సురేష్ సినిమా కూడా ఉంటుంది. వచ్చే ఏడాది సురేందర్‌రెడ్డి, నందినీరెడ్డి, రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లో నటించబోతున్నాడు.

మరి రాబోయే సినిమాలు కూడా నితిక్ కి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.... నితిన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ‘‘ఆంధ్ర విశేష్’’.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dammu audio relese in a happy movement
Young tiger ntr dammu audio released  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles