Krishnam vande jagadgurum casting

krishnam vande, jagadgurum casting

krishnam vande jagadgurum casting

7.gif

Posted: 03/29/2012 03:28 PM IST
Krishnam vande jagadgurum casting

           krishnam_van_fnt విభిన్న సినిమాలను తెరకెక్కించి విజయం సాధించిన క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో బీటెక్ బాబుగా రానా ... దేవికగా నయనతార ప్రధానపాత్రలు పోషిస్తోన్నారు. వీరి కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను క్రిష్ తెరకెక్కిస్తున్నారు.
             చిత్రానికి సంబంధించిన పలు కీలక విషయాలను క్రిష్ ఈ సందర్భంలో వెల్లడించారు. ఈ సినిమాలో రానా పాత్ర మాస్ టచ్ తోనూ, నయనతార పాత్ర క్లాస్ గాను ఉంటుందని చెప్పారు. భిన్న ధృవాలుగా ప్రవర్తించే వీరిద్దరి మధ్య, బంధమనేది ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులేంటనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని అన్నారు.
             గతంలో తాను దర్శకత్వం వహించిన 'గమ్యం' చిత్రంలో జానకి పాత్ర, 'వేదం'లో సరోజ పాత్ర  ప్రేక్షకులకి ఎలా గుర్తుండిపోయిందో ఈ సినిమాలో నయనతార పోషిస్తోన్న దేవిక పాత్ర కూడా అలానే గుర్తుండి పోతుందని క్రిష్ అంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Love ly and 3 movie theators list
Raaja mouli eega movie audio release by seven heros  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles