Raghupathi venkaiah award for balayya and ntr award for sarada

raghupathi venkaiah, award for, balayya and ntr award for sarada

raghupathi venkaiah award for balayya and ntr award for sarada

25.gif

Posted: 03/19/2012 10:03 PM IST
Raghupathi venkaiah award for balayya and ntr award for sarada

          sarada_balayya కళారంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు గుర్తింపు లభించింది.  2010 సంవత్సరపు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎమ్ బాలయ్యను వరించింది. ఎన్టీయార్ జాతీయ అవార్డును ఊర్వశి శారదకు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
          బీఎన్ రెడ్డి అవార్డుకు ప్రముఖ నిర్మాత, దర్శకుడు బి నరసింగరావు, నాగిరెడ్డి అవార్డుకు ఏవీఎమ్ శరవణన్ ఎంపిక చేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు ప్రకటించారు. ఉగాది రోజున జరిగే నంది అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు
          ఈ అవార్డులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం చలన చిత్ర ప్రముఖులు జి. ఆదిశేషగిరిరావును ఛైర్మన్‌ గానూ తుమ్మారెడ్డి భరద్వాజ, కె. బసిరెడ్డి, కొడాలి వెంకటేశ్వర్‌రావులను సభ్యులుగా, రాష్ట్ర చలనచిత్ర నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బి. వెంకటేశంలు నియమించింది.
          ఈ కమిటీ కొద్దిసేపటిక్రితం (సోమవారం) సమావేశమై జాతీయ అవార్డులను ఎంపిక చేసి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసి ఆయన ఆమోదం పొందారు. ఈ అవార్డుల కింద రూ. 2 లక్షల పారితోషికం, ప్రత్యేక జ్ఞాపికను, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. 23న  హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌ లోని లలితకళాతోరణంలో నంది బహుమతుల ప్రదానోత్సవానికి  సమాచార శాఖమంత్రి డికె అరుణ హాజరౌతారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega power stara ram charan tej would be upasana says
Kandireeka movie sequel coming up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles