Usha kiran movies ishtam movie hero charan dead

usha kiran movies, ishtam, movie hero charan dead

usha kiran movies ishtam movie hero charan dead

5.gif

Posted: 03/19/2012 01:13 PM IST
Usha kiran movies ishtam movie hero charan dead

         ishtam ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'ఇష్టం' సినిమా ద్వారా హీరోగా తెలుగుతెరకి పరిచయమైన చరణ్ రెడ్డి హఠాన్మరణం పొందారు. ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిస్వాస విడిచారు. ఈరోజు ఉదయం ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పగానే, ఆయనను జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కాసేపటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.
        ఇష్టం సినిమాలో శ్రియాతో కలిసి చరణ్ హీరోగా నటించాడు. 'ఇష్టం' సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో చరణ్ కెరీర్ కూడా ముందుకి సాగలేదు. ఆ తర్వాత అక్కినేని మనవరాలు సుప్రియను (సుమంత్ సోదరి) చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, గత సంవత్సరం వీరిద్దరూ విడాకులకు కోర్టును ఆశ్రయించారు. చరణ్ కుటుంభ సభ్యులను పలువురు ప్రముఖులకు తమ సంతాపాన్ని తెలియచేస్తూ పరామర్శిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu birth day special story
Top actors n film personalities in badsha opening function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles