సూపర్‌స్టార్ రజినీకాంత్, దీపికాపదుకొనే జంటగా రజినీ కుమార్తె సౌందర్య ఆర్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందునున్న యానిమేషన్ చిత్రం 'కొచ్చడియాన్'. ఈ భారీ సినిమాను ఈనెల 21న చెన్నరు ఎవిఎం స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖదర్శకుడు కెఎస్.రవికుమార్ కధను అందించగా యూరోస్ ఇంటర్నేషనల్ సంస్ద, సౌందర్య సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఇటీవల రజినీ అనారోగ్యం బారిన పడిన అనంతరం నటిస్తోన్న సినిమా ఇదే కావటం విశేషం. ఈ యానిమేషన్ మూవీ కోసం దేశీయ సినీచరిత్రలో మొట్టమొదటి సారిగా మోషన్ కాప్చర్డ్ టెక్నాలజీని (ఎంఓసిఏపి) విధానాన్ని వాడనున్నారు. తద్వారా చిత్రంలోని యానిమేషన్ పాత్రలన్నీ 3డిలో మరింత స్పష్టంగా కనిపిస్తాయి. రజినీకాంత్ నటించనున్న సన్నివేశాలను స్టూడియోలో వేసిన సెట్టింగులలో 80 కెమెరాలతో చిత్రీకరించనున్నారు. అనంతరం షూటింగ్ మొత్తం యుకెలో నిర్వహించనున్నారు.
ఈ చిత్రంలో మరో విశేషమేమిటంటే, సూపర్ స్టార్ రజిని కాంత్ “కొచ్చాడియన్” చిత్రం కోసం ఒక పాట పాడారు. ప్రముఖ గేయ రచయిత వైరముత్తు ఈ పాటకు సాహిత్యం అందించారు. సంగీత మాయాజాలికుడు ఏ ఆర్ రెహ్మాన్ , చిత్ర దర్శకురాలు సౌందర్య మరియు వైరముత్తు ఈ రికార్డింగ్ లో పాల్గొన్నారు. తన ఇరవై ఏళ్ల సినీ చరిత్ర లో రజినీకాంత్ పాట పాడటం ఇదే మొదటి సారి. 1992 లో “మన్నన్” అనే చిత్రం లో ఒక పాటకు రజిని కాంత్ తన స్వరాన్ని అందించారు. అల్లుడు పాటిన కొలవెరీ యావత్ దేశానికీ కిక్కెక్కిస్తే, మరి మామ పాట ఏంచేస్తుందో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more