Ravi teja daruvu movie shooting coming to an end

ravi teja daruvu, movie shooting, coming to an end

ravi teja daruvu movie shooting coming to an end

12.gif

Posted: 03/15/2012 04:15 PM IST
Ravi teja daruvu movie shooting coming to an end

           సౌండ్ అఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘దరువు’ తుది అంకానికి చేరింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులోని రాక్ కాస్టిల్ లో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతుంది. ఇందులో రవితేజ మరియు తాప్సీ పాల్గొంటున్నారు. ఈ నెల 25 వరకు హైదరాబాద్, బెంగళూరుల్లో సాగే షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, మే 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

daruvu_inner
           ఈ సినిమాలో హీరో పాత్ర చిత్రణ గురించి దర్శకుడు శివ ఇలా అంటున్నారు. ‘‘అతను పక్కా మాస్. మనిషి మాస్క్ వేసుకున్న ట్రాన్స్‌ ఫార్మర్‌ లాగా పూర్తి ఎనర్జీతో ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే’’.
          రవితేజ, తాప్సీ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: శివ ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swami nityananda clarifies today about
Ram gopal varma change the name of daggubati rana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles