Mammotty and suresh gopi film

mammotty ,and suresh, gopi film

mammotty and suresh gopi film

11.gif

Posted: 03/13/2012 02:17 PM IST
Mammotty and suresh gopi film

          an-1331481344969మలయాళంలోని అగ్రనటులైన మమ్ముట్టి, సురేష్‌గోపీ 'ద కింగ్‌ అండ్‌ కమీషనర్‌'గా నటిస్తున్నారు. దాదాపు 15కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి షాజీ కైలాస్‌ దర్శకత్వం వహించారు. గతంలో 'ద కింగ్‌', 'కమీషనర్‌' చిత్రాలకు రచన చేసిన రంజీ ఫణిక్కర్‌ ఈ చిత్రానికి కథను అందించారు.
           ఈ మూవీలో నేషనల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ డైరెక్టర్‌గా మమ్ముట్టి, ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌గా సురేష్‌గోపీ నటిస్తుండగా, కేంద్రమంత్రి కూతురుగా, జర్నలిస్టుగా సంవృత నటిస్తోంది. కాగా, ఢిల్లీలో ఓ కీలకమైన కేసును పరిశోధించే క్రమంలో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? దాని పర్యవసానం ఏమిటనే అంశాన్ని షాజీ కైలాస్‌ ఆసక్తికరంగా చిత్రీకరించారని నిర్మాత కోనేరు కల్పన తెలిపారు. కథాగమనానికి అవరోధం ఏర్పడకుండా ఉండేందుకు పాటలకు చోటు కల్పించలేదని ఆమె చెప్పారు.
           ఫిల్మ్ సిటీ, చెన్నై, న్యూఢిల్లీలో షూటింగ్‌ జరుపుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ మూవీ ఏప్రిల్‌లో తెలుగులో విడుదల కాబోతుంది.  సంజన, నెడిముడి వేణు, దేవన్‌, సాయికుమార్‌, జనార్దన్‌ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: భరణి కె. ధరన్‌, సంగీతం: రాజమణి, మాటలు: సాహితి.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Okkadine nara rohit latest movie working stills
Five books was released on how to film making  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles