Come and take meena blessings hurry up

come ,and take, meena ,blessings, hurry up

come and take meena blessings hurry up

4.gif

Posted: 02/29/2012 03:23 PM IST
Come and take meena blessings hurry up

Mమొన్నటివరకూ తన అందాలతో కనువిందు చేసిన మీనా, కొంత కాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వరాలిచ్చే దేవతగా మారింది. విఎంసి కంబైన్స్ వారి పౌరాణిక చిత్రం 'శ్రీ వాసవి వైభవం' చిత్రంలో వివిధ అవతారాల్లో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో శరవేగంతో జరుగుతోంది. మార్చి నెలాఖరు వరకూ కొనసాగుతుంది.meena2
           ఇంతవరకూ జరిగిన షూటింగ్‌లో ఆదిపరాశక్తి, సరస్వతి, పార్వతి, వైష్ణవి, గాయత్రి, కృష్ణ పాత్రలను మీనా పోషించగా చిత్రీకరించారు. వాసవి మంగళహరతిని, ఆమె విశ్వరూపాన్ని గ్రాఫిక్స్ ద్వారా తెరకెక్కిస్తున్నారు. మార్చి 4,5 తేదీల్లో వాసవిదేవి అగ్నిప్రవేశం చేసే సన్నివేశాలను, పతాక సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరించబోతున్నామని చిత్ర నిర్మాత దొరస్వామి రాజు వెల్లడించారు. ఇందులో పాల్గొనడానికి వందమంది ఆర్యవైశ్య దంపతుల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారాయన. suman          వాసవీ దేవి మహిమలు ప్రధానాంశంగా తెరకెక్కే ఈ సినిమాలో ఎనిమిది పాటలు, నాలుగు పద్యాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవిధంగా ఆడియో సిడిని తక్కువ ధరకు విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాలో నటిస్తోన్న నటీనటులంతా వారి వారి పాత్రలకు జీవం పోసే విధంగా, ఖచ్చితంగా సరిపోయారని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తుమ్మల సత్యనారాయణ అంటున్నారు.mee_act
           సుహాసిని, ప్రియాహాసన్, సుమన్, సాయికిరణ్, కన్నడ శ్రీధర్, రఘునాథరెడ్డి, అశోక్‌కుమార్, అనంత్, గుండు హనుమంతరావు, కవిత, సన ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి రచనాసహకారం: జె.కె.భారవి, కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: ఉదయభాస్కర్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot beauty seranya pictures
Stylish star allu arjun in full swing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles