Genelia and ritesh deshmukh second marriage

Genelia D`Souza,Riteish Deshmukh,Riteish-Genelia church wedding,actors riteish deshmukh, genelia dsouza, riteish genelia church wedding ceremony, riteish genelia maharashtrian style wedding ceremony, bollywood star couple, riteish genelia second marriage ceremony

After a lavish Marathi wedding on Friday, newlyweds Riteish Deshmukh and Genelia D’Souza got married the second time round on Saturday afternoon.

Genelia and Ritesh Deshmukh second marriage.gif

Posted: 02/04/2012 06:05 PM IST
Genelia and ritesh deshmukh second marriage

Riteish-Deshmukh-and-Geneli

హీరోయిన్ జెనీలియా పెళ్ళి నిన్న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తనపెళ్లిఫోటో ట్విట్టించింది కూడా. ముంబాయిలో శాంతాక్రజ్‌లోని గ్రాండ్‌ హైత్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బుద్ధిగా తల వంచుకుని మరాఠీ పద్ధతిలో తాళికట్టించుకుంది. మరి ఇంకేంటి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటని అనుకోకండి. ఈమె నిజంగానే సెకండ్ పెళ్ళి చేసుకుంది. అంటే మొదటి పెళ్ళి వేరేవారితోనో లేక రితేష్ సెకండ్ హ్యాండ్ మొగుడనో దీని అర్థం కాదు.

రెండో పెళ్ళి చేసుకోవడానికి ఓ కారణం ఉంది. అందుకే జెనీలియా మళ్ళీ రితేష్ దేశ్‌ముఖ్ నే నేడు పెళ్ళి చేసుకుంది. రితేష్ మరాఠీ హిందూ కాబట్టి నిన్న మరాఠీ సంప్రదాయంలో ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే జెనీలియా హిందూ కాదు. ఆమె రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. దీంతో వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఈ రోజు చర్చిలో వీరి వివాహం రెండో సారి జరుగబోతోంది. బాంద్రాలోని ఓ పెద్ద చర్చిలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

నిన్న మరాఠీ సాంప్రదాయంలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, సునీల్ శెట్టి, అశుతోస్ గోవర్కర్, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, అసిన్, షాజిద్ ఖాన్, సాజిద్ నడియావాలా, అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, సుభాష్ గై తదితరులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత జెనీలియా-రితేష్ నెల రోజుల పాటు విదేశాల్లో హనీమూన్ ఎంజాయ్ చేయనున్నారు. ఈనెల రోజులు ఆపని ఈ పని ముగించుకొని వచ్చిన తరువాత తాను కమీట్ అయిన సినిమా షూటింగుల్లో పాల్గొననుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandi natakostavalu
Ram charan with deepika padukone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles