Sharukh khan attack on farah khan hubby

sharukh khan, attack ,on ,farah ,khan ,hubby, at a party in mumbai,

sharukh khan attack on farah khan hubby at a party in mumbai

5.gif

Posted: 01/31/2012 12:25 PM IST
Sharukh khan attack on farah khan hubby

          fa బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్‌పై షారుఖ్ ఖాన్ పిడిగుద్దులు కురిపించాడు. అగ్నిపత్ చిత్రం విజయం సాధించినందుకు సంజయ్‌దత్ ఇచ్చిన ఓ పార్టీలో ఈ ఘటన జరిగింది.  ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శకురాలు.. ఫరాఖాన్ భర్త శిరీష్‌పై షారుఖ్ చేయి చేసుకోవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. గతంలో జానేమన్ చిత్రానికి శిరీష్ దర్శకత్వం వహించారు.

           షారుఖ్ స్వీయ నిర్మాణంలో రూపొందిన రా.వన్ చిత్రం 150 కోట్ల బాణాసంచా అని శిరీష్ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా మెసేజ్‌లు పోస్ట్ చేయడమే.. దీనికి కారణమని తెలిసింది. ఆదివారం రాత్రి ముంబై నగర శివార్లో చోటు జరిగిన పార్టీలో షారుఖ్ కొట్టడంతో శిరీష్ ముఖం తీవ్రంగా వాచిపోయినట్టు సమాచారం.

           sharukh ఆ పార్టీ  సమయంలో షారూఖ్ తనపైకి దూకి.. పిడిగుద్దులు గుద్దాడని.. ఆ క్షణంలో తనకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదని శిరీష్ ట్విట్టర్‌లో వాపోయాడు. గతంలో ‘మై హూనా’, ‘ఓం శాంతి ఓం’ లాంటి హిట్ చిత్రాలను షారుఖ్‌తో ఫరా నిర్మించారు. 

           అక్షయ్ కుమార్‌తో తీసిన తీస్‌మార్ ఖాన్ చిత్రంతో ఫరా, షారుఖ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి వీరిమధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్టు బాలీవుడ్లో అడపాతడపా వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actress vidyabalan
Madhuri dikshit new website  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles