Kamal haasan letest movie

kamal haasan letest movie, starts after viswaroopam, this movie deals with corruption,

kamal haasan letest movie, starts after viswaroopam

4.gif

Posted: 01/24/2012 12:11 PM IST
Kamal haasan letest movie

        kamal  బహుముఖ ప్రజ్ఞాశాలైన భారత జాతీయ నటుడు కమల్ హాసన్. అతను నటించే ప్రతి చిత్రమూ ఓ విభిన్నమే. ఇదే విషయం రుజువు చేస్తాయి అతని చిత్రాలు. ప్రస్తుతం విశ్వరూపంచిత్రంతో తన నటనా విశ్వరూపాన్ని మరోమారు సరికొత్తగా ప్రేక్షకులముందు పెట్టాలని కమల్ ఉవ్విళ్లూరుతోన్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే ఈ చిత్రం అనంతరం మరో సందేశాత్మక చిత్రం తీసేందుకు ఆయన రెడీ అయిపోతున్నట్టు తెలుస్తోంది.

          ఈ ధఫా అవినీతిపై సమరశంఖం పూరించేందుకు కమల్ హాసన్ సంసిద్ధులవుతున్నారు. గతంలో ఇదే అంశంపై ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడుసినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అవినీతిపై మరింత లోతుగా ఈ చిత్రం ఉండబోతుందని చిత్రవర్గాల సమాచారం.

          ద్విభాషా చిత్రంగా రూపొందించాలని తలుస్తోన్న ఈ సినిమా దేశంలో ఎంత అవినీతి బట్టబయలవుతోన్నాకాని, అవినీతి పరులపై తీవ్రస్థాయిలో దండన ఉండటంలేదనే కథాంశంతో రూపొందిస్తారని వెల్లడి. ప్రస్తుతానికి కమల్ హాసన్ తానే దర్శకత్వం వహించి నటిస్తోన్నవిశ్వరూపంచిత్రం తుదిదశ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఆ మూవీ అనంతరం అవినీతి ప్రక్షాళనకు సంబంధించిన చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero aadi latest movie lovely
Great director rajamouli latest movie eega  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles