Young rebal star prabhas

young rebal star prabhas latest movie vaaradhi shooting is going on in hyderabad

young rebal star prabhas latest movie

19.gif

Posted: 01/23/2012 06:51 PM IST
Young rebal star prabhas

19యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ వారధిచిత్ర షూటింగ్ చరమాంకానికి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. ఆమధ్య సునీల్ నటించిన మర్యాద రామన్నచిత్రం కోసం వేసిన ఇంటి సెట్లోనే ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటిస్తోన్న ఈ సినిమాను ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు కొన్ని చిత్రాలకు సంభాషణలు అందించిన కొరటాల శివ ఈ చిత్రంతో దర్శకునిగా అవతరిస్తున్నారు. ఈ మూవీకి సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ను విభిన్నంగా చూపించబోతున్నట్టు చిత్రవర్గాల సమాచారం.

…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director shankar latest movie
Daggubati rana letest movie shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles