Allu arjun

allu arjun works hard for his every movie

allu arjun works hard

1.gif

Posted: 01/23/2012 11:02 AM IST
Allu arjun

1తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా విజయానికి తన వంతు కృషి చేసే వాళ్లలో అల్లు అర్జున్ ముందు వరుస లో నిలుస్తారు. అతని ప్రతీ మూవీలోనూ పాత్రకు తగ్గట్టుగా ఎంత కష్టానికైనా ఓర్చి మెప్పించాలని తపించే అర్జున్ ఇంతకు ముందు సినిమాలన్నింటిలో ఇది ప్రతిఫలిస్తుంది. ఆర్యా2 చిత్రంలో డ్యాన్స్ ల విషయంలో కానీ, నిన్నటి బద్రీనాథ్ మూవీలో ఫైట్స్ అంశంలో కాని అర్జున్ తెరవెనుక చేసిన కష్టం తెరపై కళ్లకు కట్టింది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే సినిమా బాగా రావటానికి తనవంతుగా ఎలా తపించేవారో ఇప్పుడు అర్జున్ ను చూస్తే అదే గుర్తుకు వస్తుంది.

          ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం కోసమూ అల్లు అర్జున్ ఇదే రీతిన కష్టపడుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీలో అధ్బుతమైన రైన్ ఫైట్ చిత్రీకరించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య అంటే కేవలం 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ ఫైటింగ్ సన్నివేశాలు షూట్ చేశారు. ఇందులో అర్జున్ చాలా బాగా చేశారని చిత్రవర్గాలు చెబుతున్నాయి.


          తొలిసారి అర్జున్ సరసన ఇలియానా ఈ సినిమాకు జతకడుతోంది. గతంలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సామూవీలో ఇలియానా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై రాధ కృష్ణ నిర్మిస్తున్నారు. డివివి దానయ్య సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

…avnk


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leading music director
Telugu warriors win the match  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles