Evadu movie story leak story

evadu movie story leak story, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

evadu movie story leak story, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

evadu.gif

Posted: 12/22/2011 06:53 PM IST
Evadu movie story leak story

evadu-img"తినబోతూ రుచులడగటమెందు" కన్న సామెత ఒట్టిగానే రాలేదు.  కథను చివరివరకూ తెలియకుండా ఉంచేది కేవలం సినిమా చూసే థ్రిల్ ని కాపాడటానికే.  ఆ కథ ఒకవేళ లీక్ అయినా దాన్ని ప్రచురించి ప్రచారం చేసి సినిమా చూసే ఆనందాన్ని పాడుచెయ్యటం వలన వారికి ఒరిగేదేమిటో అర్థం కాదు.  రామ్ చరణ్ చేస్తున్న ఎవడు సినిమా కథేమిటో తెలిసిపోయిందట.  మరి రామాయణం కూడా అందరికీ తెలుసు.  శ్రీరామరాజ్యం సినిమాకి దానివలనేమైనా తేడా వచ్చిందా.  కథ కాదు దాన్ని చిత్రీకరించిన విధానం, ఆ కథను మనకు చెప్పిన పద్ధతి ముఖ్యం. 

నా సొంత అనుభవమొకటి చెప్తానిక్కడ.  పాత సినిమాల్లో శోభన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా చూడటానికి మా స్నేహితులంతా కలిసి పోయాం.  పోతుంటేనే ఒకడడిగాడు "ఎక్కడికీ" అని.  "ఓహ్ ఆ సినిమా, అందులో శోభన్ బాబు చచ్చిపోతాడుగా" అన్నాడు.  అంతే! మా సినిమా ఆనందమంతా పోయింది దానితో.  సినిమా మొదలైన దగ్గర్నుంచీ శోభన్ బాబు పోరాటం చేసే సన్నివేశమైనా, కారు నడుపుతున్నా, చివరకు మెట్ల మీద నుంచి దిగుతున్నా ఇక చచ్చిపోతాడేమో నని ఎదురు చూసాం.  మేము సినిమా చూడలేదు.  శోభన్ బాబు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తున్నట్టే అయింది.  సినిమా అంతా అయిపోయింది.  శుభం కార్డు కూడా పడింది కానీ శోభన్ బాబు శుభ్రంగా ఉన్నాడు. ఇంతా చేసి కథలోని అంశాన్ని లీక్ చేసినవాడు తన కన్ఫ్యూజన్ లో మరో సినిమా కథ గురించి చెప్పాడట. 

అలావుంటాయి ఈ ఊహాగానాలు.  పాత రోజుల్లో నాటకం జరుగుతుంటే కూడా తెర కొద్దిగా తీసి లోపల మేకప్ చేసుకుంటున్నవాళ్ళు ఎలా ఉన్నారో చూడాలని తపనపడేవారుండేవారు.  ఎవడు లీక్ చేసాడో లేకపోతే లీక్ చేసానని అనుకుంటున్నాడో లేదా లీక్ చేసానన్న భ్రమలో ఉంచుతున్నాడోకానీ "ఎవడు" సినిమాకేమీ నష్టం కాదు.  నష్టం జరిగితే సినిమా చూసేవాళ్ళకే!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna becomes kalki
Mahesh the business man movie audio release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles