Tollywood heroines

Tollywood Heroines, Tollywood Heroines Bikini Gallery, telugu film songs, telugu movie comedies, telugu film action films and on all telugu films actors, actresses including

Tollywood Heroines

Tollywood Heroines.GIF

Posted: 12/01/2011 04:55 PM IST
Tollywood heroines

Tollywood Heroines

ఒకప్పటి కథానాయికలు ఒక సినిమా ఫ్లాపయితే ఆ ఒక్క దెబ్బతోనే కనుమరుగయ్యేవారు. ఇక వాళ్లకు అవకాశాలు దాదాపు మూసుకుపోయేవి. ఇప్పటి కథానాయికలకు అవకాశాలు పుష్కలం. ఒక్క సినిమా ఛాన్స్‌ దొరికితే చాలు లక్కు తన్నుకు వచ్చినట్లే. పొరపాటున ఆ సినిమా ఫట్టుమన్నా...మరో రెండు సినిమాలు ఆడకపోయినా వాళ్లకు అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. అవన్నీ కాకపోతే బుల్లితెర ఎలానూ ఉండనే ఉంది.

ఏదో ఒక రియాలిటీ షోల పేరిట ఈ ఫ్లాపు హీరోయిన్లు విజయవంతంగా తమ కార్యక్రమాలను పూర్తిచేసి అందినంత సొమ్ముచేసేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్లకు మరో అవకాశం కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. పొరుగునే ఉన్న కోలీవుడ్‌లో అమాంతం పాగా వేసేస్తున్నారు. ఈ ట్రెండ్‌ పాతదే అయినప్పటికీ ఇప్పుడు కోలీవుడ్‌ను ఏలే రాణులంతా మన తెలుగులో పాపులర్‌ అయిన హీరోయిన్లే కావడం విశేషం.  

అనుష్క ఇప్పటికే సింగం, నాన్న తమిళ చిత్రాలలో నటించిన అనుష్క ఇప్పుడు ఏకంగా రజనీకాంత్‌ లేటెస్ట్‌ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. కాజల్‌ కార్తీ సోదరుడు సూర్యతో ‘మాత్రాన్‌’ చిత్రంలో చేస్తోంది. లేటెస్ట్‌గా విజయ్‌తో ‘తుపాకి’ చిత్రంలో నటిస్తోంది. రిచాగంగోపాధ్యాయ్‌ తమిళంలో అడుగుపెడుతూనే రెండు హాట్‌ ప్రాజెక్టులు చేజిక్కించుకుంది.

ధనుష్‌తో నటించిన చిత్రం ఇటీవలే విడుదలై విజయఢంకా మోగించి రిచాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘ఓస్తి’ చిత్రం విడుదల కావలసి ఉంది. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్టులు రిచాకు వచ్చిపడుతున్నాయి. అలాగే దీక్షాసేథ్‌ ఒక పక్క తెలుగు చిత్రాలలో నటిస్తూనే తమిళంలో ‘వెట్టయ్‌మన్నన్‌’ చిత్రంలో నటిస్తోంది. అది తెలుగులో వీడింతేగా రాబోతోంది. విక్రమ్‌ అందులో హీరో. తమన్నా గత రెండు సం వత్సరాలుగా కోలీవుడ్‌ను తన గ్రిప్‌లో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి కేంద్రీకరించడంతో ఈ రేస్‌లో కొద్దిగా వెనకబడింది. ఇలా ఇక్కడ టాలీవుడ్‌లో పేరుతెచ్చుకుని తమిళ సూపర్‌స్టార్లతో చెలరేగిపోతున్నారు మన తారలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  24 hours time pass
Lux baby asha saini  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles