Actually excercises are useful for us but

Actually excercises are useful for us but

Excercises, Body, Health, Body maintain, Healthy Tips, Beauty Tips, Tips, Excercise Tips

Actually excercises are useful for us but some times its not good for us. Over excercises will effect your body. So do excercise with perfect precations.

వంటికి వ్యాయామం మంచిదే... కానీ

Posted: 01/07/2016 04:31 PM IST
Actually excercises are useful for us but

వంటికి యోగా ఏంటి... ఏ వ్యాయామం అయినా మంచిదే... కానీ యోగా తో శారీరిక మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది... సరే, మీకున్న సౌకర్యాలని బట్టీ, ఇంట్రెస్ట్ ని బట్టి, ఎటువంటి విధమైన వ్యాయామం చేసినా, అనుకున్నంత త్వరగా ఫలితం మాత్రం పొందలేకపోతున్నారా? శ్రమ సేం కానీ రిజల్ట్ నాట్ సేం... ఎందుకిలా? మనకి తెలియకుండా ఏమైనా లోపం చేస్తున్నామా? పోనీ, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా?

* పరగడుపున వ్యాయామం చెయ్యడానికి ఇష్టపడతాం మనం. కానీ కనీసం నిమ్మకాయ తేనె కలిపిన రసం, ఒక యాపిల్ అయిన తీసుకుని, వ్యాయామం చెయ్యమని ఎక్స్పర్ట్స్ ఏ సూచిస్తున్నారు... ప్రత్యేకించి బరువు తగ్గాలి అనుకునే వారు, ఇలా చెయ్యడం వల్ల, చక్కని ఫలితాలు ఉండటం తో పాటు, మరింత ఎక్కువ వ్యాయామం చెయ్యడానికి, వ్యాయామానంతరం అలసిపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది... అలాగే, శరీరం లో కొవ్వు కరిగి, స్కిన్ సాగ్ అవ్వకుండా, గట్టిపడుతుంది...

* సాయంకాలం పూట వ్యాయామం చేసే వారు, 5 నుంచీ 7 గంటల సమయం మధ్యలో వ్యాయామం చేసి, ఒక గంట తరువాత, మితంగా భోజనం చేసి, నిద్రకు ఉపక్రమిస్తే మంచిది... ఏ 8 గంటల రాత్రికో వ్యాయామం చేస్తే, రోజంతా పని చేసి అలసిపోయిన వొళ్ళు, వ్యాయామానికి పెద్దగా స్పందించకపోవచ్చు.

* నిద్రకు ఉపక్రమించే ఒక మూడు గంటల ముందు మితంగా ఆహారం, ఎక్కువశాతం 2/3 పుల్కాలు, కూర తీసుకుని ఆతరువాత ఏమీ తినకూడదు... అంతగా ఆకలి వేస్తె, నిద్ర పోయేముందు, ఒక గ్లాసు గోరువెచ్చని పాలో, లేక మజ్జిగో తీసుకోవాలి. పడుకునేటప్పుడే లైట్ గా ఆకలి వేస్తూ ఉన్నట్టుగా ఉండాలి. ఆహారాన్ని శరీరం జీర్ణం చేసుకున్న తరువాత, మనం జీర్నాశయానికి పని ఇవ్వకపోతే, శరీరంలోని కొవ్వుని కరిగించే విధంగా పని చేస్తుంది మన సిస్టం.

చివరిగా ఇంకో సలహా... ఏదో అమాంతం బరువు తగ్గిపోవాలి, నాజూకుగా ఉండాలి అన్న స్ట్రెస్ తో కాకుండా, వ్యాయామాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే, ఊహించని అద్భుత ఫలితాలు, మీ సొంతం అవుతాయి!

*సునయన బాదం*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : Excercises  Body  Health  Body maintain  Healthy Tips  Beauty Tips  Tips  Excercise Tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more