Experts Suggesting Simple Home Remedies To Get Soften Skin | Beauty Tips | Beauty Home Remedies

Simple home remedies to get soften skin

soften skin remedies, soften skin home remedies, soften skin beauty tips, skin beauty tips, skin remedies, skin health tips, skin beauty remedies

Simple Home Remedies To Get Soften Skin : Experts Suggesting Simple Home Remedies To Get Soften Skin.

మృదువైన ముఖచర్మం పొందాలంటే...

Posted: 10/17/2015 12:51 PM IST
Simple home remedies to get soften skin

వాతావరణం కాలుష్యం కారణంగా చర్మ సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా.. చర్మం మృదువుతనం కోల్పోయి ఆ తర్వాత సౌందర్యం తగ్గిపోతుంది. అలాకాకుండాచర్మం మృదువుతనం కోల్పోకుండా వుండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలను రెగ్యులర్ గా పాటించడం వల్ల మృదువుదనంతోపాటు చర్మసౌందర్యం మరింత పెరుగుతుంది. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* ప్రతిరోజూ రాత్రివేళల్లో నిద్రపోయే ముందు ముఖానికి కొద్దిగా పాలమీగడను రాసుకుని, బాగా మర్దన చేయాలి. అలాగే పడుకుని, తర్వాత రోజు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల ముఖంపై చర్మం మృధువు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
* రాత్రివేళల్లో నిద్రపోయే ముందు కొద్దిగా ఆలివ్ నూనెను తీసుకుని, ముఖానికి పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి. తర్వాతి రోజూ ఉదయం ముఖం తాజాగా, కోమలంగా కనిపిస్తుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఎంతో శ్రేయస్కరం.
* సాధారణంగా కొందరికి పొద్దున్నే నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే రాత్రి పూట తీసుకునే భోజనంలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
* రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ముఖానికీ, కంటి భాగంలో ఏదయినా మేకప్ వేసుకుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోవాలి. తరువాత కొద్దిగా మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి. ముఖం కడుక్కున్న వెంటనే రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
* గంధం పొడిలో చెంచా పాలు, రెండు చుక్కల తేనె కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆరిన తర్వాత మృదువుగా మర్దన చేస్తూ చల్లని నీటితో కడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soften skin home remedies  skin beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more