The Healthy Home Remedies Home Remedies To Get Rid From Dry Hair | Haircare Tips | Hair Home Remedies

Home remedies to get rid from dry hair

dry hair remedies, dry hair tips, dry hair beauty tips, dry hair home remedies, dry hair best remedies, dry hair healthy tips, dry hair best tips, hair care tips, hair care remedies, hair care best home tips, hair tips

Home Remedies To Get Rid From Dry Hair : The Healthy Home Remedies Home Remedies To Get Rid From Dry Hair.

కురుల సౌందర్యాన్ని మెరుగుపరిచే బెస్ట్ రెమెడీస్

Posted: 10/15/2015 01:55 PM IST
Home remedies to get rid from dry hair

మహిళల చర్మసౌందర్యానికి కురులు మరింత అందాన్ని చేకూరుస్తాయి. మిళమిళ మెరిసే జుట్టు వారి సౌందర్యానికి తోడై.. అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే.. జుట్టును నిత్యం సంరక్షించుకోవడం కోసం మహిళలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ప్రస్తుత ఆధునిక యుగంలో వాతావరణ కాలుష్య ప్రభావం జుట్టును నిర్జీవంగా మార్చేయడంతోపాటు వివిధ ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. ఇలాంటి సమయాల్లో జుట్టును రక్షించుకోవాలంటే.. బ్యూటీ ప్రోడక్ట్స్ వినియోగించడం కంటే ఇంట్లో చేసుకునే రెమెడీలే ఎంతో శ్రేయస్కరం. మరి.. ఆ రెమెడీలేంటో తెలుసుకుందామా..

* నిమ్మకాయ-పాలు : ఒక పాత్రలో రెండు కప్పుల పాలు తీసుకుని.. అందులో ఒక నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. కుదుళ్లకు, జుట్టుకు రాసుకుని.. అరగంట తర్వాత కడిగేసుకోవాలి. నిమ్మకాయలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగని.. నిమ్మకాయని ఎప్పుడూ డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. ఏదైనా ఇతర పదార్థంలో నిమ్మను జోడించి, జుట్టుకు పట్టిస్తే మంచిది.

* తేనె-ఆలివ్ ఆయిల్ : ఒక గాజుపాత్ర తీసుకుని అందులో తేనె, ఆలివ్ ఆయిల్ రెండింటిని వేసి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా కొన్నాళ్లపాటు రెగ్యులర్ గా చేస్తే.. జుట్టు మృదువుగా తయారవడమే కాదు.. చివర్లు కూడా చిట్లిపోకుండా.. సిల్కీగా మెరిసిపోతాయి.

* అవకాడో : అవకాడో గుజ్జు తీసి.. దానికి ఒక టేబుల్ స్పూన్ పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టులో వుండే మలినాలు పూర్తిగా తొలగిపోయి.. మిళమిళ మెరుస్తాయి.

* కోడిగుడ్డు : గుడ్డులోని తెల్లసొన, టీ డికాషన్ తీసుకుని రెండింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేస్తే.. పొడిబారిన, గరుకుగా మారిన జుట్టుకు గుడ్ బై చెప్పవచ్చు. బ్లాక్ టీ కురులకు సహజ మెరుపుని రంగుని అందిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dry hair home remedies  haircare tips  beauty tips for hair  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more