Different types of amla remedies helps hair growth | beauty tips | beauty home remedies

Amla helps hair growth beauty tips home remedies

amla beauty benefits, amla hair growth, amla home remedies, amla beauty remedies, amla beauty tips, amla tips, amla best tips, amla recipes, amla homemade remedies, amla beauty, beauty tips telugu, amla health, beauty fruits

Amla helps hair growth beauty tips home remedies : By applying the different types of amla remedies to hair we can get more benefits. First hair growth increase in few days.

జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ‘ఉసిరి’

Posted: 06/24/2015 01:32 PM IST
Amla helps hair growth beauty tips home remedies

పోషకాహారలోపంతోపాటు వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. అప్పుడు జుట్టు పొడిపొడిగా మారిపోయి, రాలిపోవడం.. త్వరగా తెల్లబడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి సమస్యల్ని ఎదురుకోవాలంటే కొన్ని సింపుల్ రెమెడీలు అందుబాటులో వున్నాయి. అవి ఎంతో సమర్థవంతంగా పనిచేసి.. జుట్టు సమస్యల్ని అరికడుతాయి. అలా ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీల్లో ఉసిరికాయ ఎంతో ఉత్తమమైంది.

ఉసిరి నూనె, హెయిర్ ప్యాక్ వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది హెయిర్ ఫోలి సెల్స్ కు ఆక్సిజన్, న్యూట్రీషియన్స్ ఎక్కువగా అందిస్తుంది. తద్వారా జుట్టును హెల్తీగా, బ్యూటిఫుల్ గా వుండటంతోపాటు త్వరగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు.. ఈ ఉసిరి చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్, డ్రైహెయిర్ వంటి సమస్యల్ని నివారించడంతోపాటు జుట్టును స్ట్రాంగ్ గా వుంచుతుంది. అలాంటి ఈ ఉసిరితో రకరకాల రెమెడీలు చేసుకుని జుట్టుకు పట్టిస్తే ఎంతో శ్రేయస్కరం.

జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ఉసిరి రెమెడీలు :

* ఆమ్లా జ్యూస్-ఎగ్ ప్యాక్ : మూడు ఉసిరికాయలను తీసుకుని వాటిని మధ్యలో కట్ చేయాలి. అనంతరం వాటిని జ్యూసర్ లో వేసి జ్యూస్ చేయాలి. ఈ జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో గుడ్డు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పొడవునా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుదల వేగంగా పెరుగుతుంది.

* ఆమ్లా పౌడర్ : ఫ్రెష్ గా ఉండే ఆమ్లాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలను ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పౌడర్ ను ఇతర నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ గా జుట్టుకు వేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ వేసుకున్న అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

* ఆమ్లా పౌడర్-కొబ్బరి నూనె : ఒక పాత్ర తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ లో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చగా వున్నప్పుడే ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు పట్టించుకోవాలి. 10 నిముషాలవరకు బాగా మసాజ్ చేసుకోవాలి. రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

* ఆమ్లా పౌడర్-మెంతులు : ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చెంచా ఆమ్లా పౌడర్, ఒక చెంచా మెంతి పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో మూడు టేబుల్ స్పూన్ల ఆముదం వేసి మళ్లీ బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు, వెంట్రుకలకు బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత తలకు సున్నితంగా మసాజ్ చేయాలి. అనంతరం ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

* ఆమ్లా ఆయిల్ : ఉసిరికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకోవాలి. తర్వాత అందులో మూడు చెంచాల మెంతుల పొడి, అరకప్పు కొబ్బరి నూనెలో వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ బాయిల్ చేయాలి. చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ని జుట్టుకి పట్టించి, మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజూ ఉదయాన్నే పట్టించుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల ప్రోత్సహింపబడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amla beauty  hair growth tips  hair problems  home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more