The natural home made remedies for dry skin

beauty tips, beauty tips for dry skin, dry skin problems, dry skin beauty tips, beauty tips dry skin, home remedies for dry skin, dry skin home remedies, natural home remedies for face, home remedies for face, facial packs, dry skin facial packs

the natural home made remedies for dry skin

పొడిచర్మం సమస్యను తగ్గించుకోండిలా...

Posted: 10/31/2014 05:41 PM IST
The natural home made remedies for dry skin

అందం విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. రెగ్యులర్ వాడే బ్యూటీక్రీమ్స్, లోషన్లను క్రమం తప్పకుండా వాడాల్సి వుంటుంది. అలాగే అప్పుడప్పుడు బ్యూటీపార్లర్ కు వెళ్లి అందం విషయంలో కేర్ తీసుకోవాల్సి వుంటుంది. ఒకవేళ క్రమం తప్పితే కొన్ని చర్మసమస్యలు సంభవిస్తాయి. అందులో మొదటిగా చర్మం పొడిగా మారటం! నిజానికి ఈ సమస్య దాదాపు ప్రతిఒక్కరిలోనూ వుంటుంది. చర్మానికి స్థిరంగా తేమ, జిడ్డు లేకపోతే పొడిగా మారుతుంది. అందుకే ఎల్లప్పుడూ సబ్బులు, ఫేష్ వాట్ వంటివి చేస్తుంటే చర్మం నార్మల్ గా వుంటుంది. కానీ వాతావరణ మార్పుల వల్ల చర్మం పొడిగా మారడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఎన్ని లోషన్లు వాడినా.. కొద్దిసేపటి వరికే వాటిప్రభావం వుంటుంది గానీ.. తర్వాత చర్మం పొడిగా మారడం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించుకోకపోతే ముఖం అందవిహీనంగా మారిపోతుంది. అలాంటప్పుడు ఈ సమస్యను కొన్ని సహజమార్గాల ద్వారా అధిగమించవచ్చు. ఆ బ్యూటీ టిప్స్ ఏమిటంటే..

1. తేనె ప్యాక్ : తేనె, నారింజ రసం కలిపిన మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. దీనిని చర్మం మీద బాగా రుద్దుకుని... 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. పొడిచర్మం సిల్కీగా, మృదువుగా మారుతుంది.

2. గుడ్డు ప్యాక్ : ముందుగా ఒక గుడ్డును తీసుకుని దానినుండి తెలుపు, పసుపు సొనలను వేరుచేయాలి. తరువాత గుడ్డు పచ్చసొన తీసుకొని బాగా కలిప... దానిలో ఒక టేబుల్ స్పూన్ నారింజ రసం, ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ తేనే, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి ఉదయం స్నానానికి ముందు రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

3. మామిడి మాస్క్ : బాగా పండిన మామిడికాయను తీసుకోని తొక్క నుండి గుజ్జును వేరుచేయాలి. ఆ గుజ్జును మిక్సర్ లో వేసి మెత్తగా చేయాలి. ఇలా చేసిన అనంతరం అందులోనుంచి ఒక స్పూన్ మెత్తని గుజ్జును తీసుకుని అందులో ఒక స్పూన్ తేనే, మూడు స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

4. అరటి మాస్క్ : తాజగా వుండే రెండు అరటి పండ్లను తీసుకోని, తొక్క తీసి మిక్సర్ లో వేసి మెత్తని గుజ్జుగా చేయాలి. దీనిని ముఖం మీద బాగా రాసుకుని.. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. పెరుగు ప్యాక్ : ఒక కప్పులో రెండు స్పూన్స్ పెరుగు తీసుకోని దానిలో కొద్దిగా తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి.. ముఖానికి పట్టించుకోవాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more