The natural home made remedies which prevents white hairs within few days

beauty tips, beauty tips for hairs, hairs tips, hair loss tips, hair gain tips, beauty tips for face, beauty home remedies, home remedies for hairs, hair home remedies, home remedies for beauty, home remedies for face

the natural home made remedies which prevents white hairs within few days

తెల్లజుట్టును నివారించే ఇంటి చిట్కాలు!

Posted: 10/21/2014 06:26 PM IST
The natural home made remedies which prevents white hairs within few days

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ప్రతిఒక్కరు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. కాలంతోపాటు మానవశరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి కాబట్టి.. అందాన్ని మెయింటెయిన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. పైగా ఈ బిజీ ప్రపంచంలో అన్ని పనులు ఒత్తిళ్లతో కూడుకున్నవే కాబట్టే.. ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. తద్వారా ఆరోగ్య సమస్యలతోపాటు సౌందర్యపరంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మెదడుకు ఎక్కువ పని ఇవ్వడం వల్ల అది జుట్టుకు కావల్సిన పోషకాలు అందించడంలో విఫలం అవుతుంది. తద్వారా జుట్టు రాలడం లేదా తెల్లగా మారడం జరుగుతుంది. జుట్టురాలే సమస్య చాలా తక్కువే కానీ.. తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లగా మారిపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. నిత్యం పనిమీదే ధ్యాస వుండటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. తెల్లజుట్టును నివారించే ప్రోడక్ట్స్ చాలావరకు అందుబాటులో వున్నాయి కానీ.. అవి తాత్కాలికంగానే పనిచేస్తాయి. అలాకాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చాలన్నా... నల్లగా వుండే జుట్టు తెల్లబడకూడదంటే.. ఇంట్లోనే కొన్ని ఉత్పత్తులను తయారుచేసుకుని ఈ సమస్యలను అధిగమించవచ్చు. మరి ఆ ఉత్పత్తులేమిటో తెలుసుకుందాం...

1. కొబ్బరినూనె - కరివేపాకు మిశ్రమం : కొబ్బరి నూనె తలకు, జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. కరివేపాకు ఆయుర్వేద గుణాలను అందిస్తుంది.
విధానం : అరకప్పు కరివేపాకులో కొబ్బరినూనెను వేయాలి . దీన్ని ఒక పాన్ లో వేసి తక్కువ మంట మీద కాచుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని తలకు, జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

2. ఆమ్లా/ఉసిరికాయ : ఇండియన్ గూస్బెర్రీగా పలువబడే ఉసిరియకాయలో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
విధానం : ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, ఎండలో ఎండనివ్వాలి. ఎండిన తర్వాత ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి కొద్ది సమయం బాగా మరిగించాలి. ఈ ఉసిరికాయ ముక్కలు క్రిస్పీగా గట్టిపడుతాయి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను తలకు, జుట్టుకు పట్టించాలి. కొంత సమయం అలాగే ఉంచుకొని తర్వాత నాణ్యమైన షాంపుతో తలస్నానం చేయాలి.

3. మజ్జిగ - కరివేపాకు మిశ్రమం : ఈ రెండింటిలో వుండే పోషకాలు జుట్టును కాంతింవంతంగా మెరిసేలా చేయడంతోపాటు ఎల్లప్పుడూ గ్రే కలర్ లో వుండేందుకు సహాయపడుతాయి.
విధానం : ఒక కప్పు మజ్జిగలో గుప్పెడు కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్నితలకు పట్టించాలి. అరగంట వరకు అలాగే ఉంచి, తర్వాత మసాజ్ చేసుకోవాలి. అనంతరం తలస్నానం చేసుకోవాలి.

4. క్యారెట్ సీడ్ ఆయిల్ - నువ్వుల నూనె మిశ్రమం : క్యారెట్ సీడ్ ఆయిల్, నువ్వుల నూనె మిశ్రమాన్ని తలకు బాగా పట్టిస్తే గ్రేహెయిర్ నివారించబడుతుంది.
విధానం : 4 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెలో కొద్దిగా క్యారెట్ సీడ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

5. నిమ్మరసం - బాదం ఆయిల్ - ఉసిరి మిశ్రం : నిమ్మరసం, ఉసిరికాయ, బాదం ఆయిల్లో ఆయుర్వేదిక్ గుణగణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ మూడు పదార్థాల మిశ్రమం గ్రేహెయిర్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.
విధానం : ఈ మూడింటిని ఒక పాన్ లో వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజరేటర్లో 3రోజుల పాటు నిల్వ చేసి, తర్వాత తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ప్రతి రోజూ కూడా అప్లై చేయవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more