ప్రతిఒక్కరిలో ఇది ఒక సహజమైన సమస్య. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు చర్మం మీద మురికి వుంటుంది. ఇది ఎక్కువగా వాతావరణ కాలుష్యం వల్ల చర్మం మీద మురికి పేరుకుపోతుంది. పైగా వేసవి కాలంలో ఇది మరి ఎక్కువగా వుంటుంది. వేసవితాపం అధికంగా వుండటం వల్ల శరీరం నుంచి కొవ్వు పదార్థం చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో చుట్టుపక్కల వున్న దుమ్మ, పొగ, ఇంకా రకరకాల కాలుష్య పదార్థాలు చర్మం మీద పడటం వల్ల... అవి చెమటతో కలిసిపోయి, కూరుకుపోతాయి. దీంతో చర్మానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి.
మురికి పదార్థాలు చాలావరకు మనకు కనిపించని ప్రదేశాల్లో.. అంటే మెడ, గొంతు, జాయింట్స్, మోచేతులు, వీపు, చంకల కింద ఎక్కువగా పేరుకుపోతుంది. సాధారణంగా ప్రతిఒక్క మనిషిలో ఇటువంటి ప్రదేశాలు కొంచెం నల్లగానే కనిపిస్తాయి. ఎందుకంటే అటువంటి ప్రదేశాల్లో నిత్యం మురికి వుంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశాలను సాధ్యమైనంతవరకు ఎక్కువగా శుభ్రం చేసుకుంటూనే వుండాలి. లేకపోతే అక్కడ మరింత మురికి చేరిపోయి, దురదలు ఏర్పడే అవకాశాలు చాలానే వుంటాయి. ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఇటువంటి ప్రదేశాలను ఎక్కువగా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది.
ప్రస్తుతకాలంలో చర్మం మీద వుండే మురికిని తొలగించుకోవడానికి అనేకరకాల పద్ధతులు మార్కెట్లో అందుబాటులో వున్నాయి. అందులో ముఖ్యంగా స్ర్కబ్బింగ్, ఎక్స్ ప్లోయేటింగ్, క్లెన్సింగ్ వంటి ఎంతో ప్రభావవంతంగా పనిచేసి... చర్మం మీద, చర్మరంధ్రాల్లో నిలిచిపోయిన మురికి వెలికి తీయడానికి ఎంత సహాయపడుతాయి. అయితే ఇటువంటి రసాయనిక ఉత్పత్తులు ఎక్కువ ఖర్చుతో కూడి వుంటాయి. సాధారణ వ్యక్తులు ఇటువంటి పద్ధతులను ఎప్పుడూ అవలంభించి వుండరు కూడా. కానీ కొన్ని ప్రకృతి సహజమైన పదార్థాలను ఉపయోగించి చర్మం మీద వుండే మురికిని మటుమాయం చేయవచ్చు. దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
చర్మం మీద, చర్మ రంధ్రాల్లో వున్న మురికిని తొలగించడానికి అవసరమయ్యే కొన్ని నేచురల్ టిప్స్ :
1. హాట్ షవర్... అంటే ప్రతిరోజు వేడినీటితో స్నానం చేయడం. ఉదయం ఆఫీసుకు బయలుదేరేముందు ఒకసారి, ఆఫీసు నుంచి రాగానే మరొకసారి హాట్ షవర్ చేసుకోవడం వల్ల చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ సమయంలో చర్మం మీద, రంధ్రాల్లో వుండే మురికి కొద్దిమేరకు తొలగిపోతుంది. అయితే ఈ హాట్ షవర్ కి ముందు నాణ్యమైన స్ర్కబ్బింగ్ చేసుకుని తరువాత స్నానం చేస్తే.. ఇంకా క్లియర్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
2. తడి బట్ట (తువాలు (టవాల్))తో తుడుచుకోవడం... ముందుగా టవల్ ను వేడినీటితో తడిపిన తరువాత అందులో వున్న నీరు మొత్తం పిండేయాలి. ఆ తడి టవల్ తో శరీరం మొత్తం శరీరం మొత్తం కొద్ది గట్టిగా ప్రెస్ చేసి తుడుచుకోవడం వల్ల చర్మంలోపలున్న మురికి బయటకు వచ్చేస్తుంది. అయితే ప్రెస్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మరి ఎక్కువగా ప్రెస్ చేయకుండా నార్మల్ పద్ధతిలో చేసుకోవాలి.
3. ఓట్ మీల్స్ తో స్ర్కబ్బింగ్... ఓట్ మీల్స్ లో కొద్దిగా పాలుపోసి, బాగా కలియబెట్టి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు చర్మానికి అప్లై చేసుకుని, కొద్దిసేపటి తరువాత వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు పాటిస్తే.. నిగారించే చర్మం మీ సొంతం అవుతుంది.
4. షుగర్ (చెక్కెర) స్ర్కబ్... మొదటగా చర్మాన్ని తడిగా వుంచి.. తరువాత పంచదారతో రుద్దుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసుకుంటే.. చర్మంలో వుండే మలినాలు, మురికి పదార్థాలు పూర్తిగా తొలగిపోయి, క్లియర్ స్కిన్ ను పొందుతారు. అయితే రుద్దేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు.
5. నిమ్మరసంతో స్ర్కబ్బింగ్... నిమ్మరసం చర్మసౌందర్యాన్ని పెంపొందించడంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేసి, దానిని చర్మం మీద మర్ధన చేసుకోవాలి. కొద్దిసేపు తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మం తెల్లగా మారడంతోపాటు, మురికి కూడా తొలగిపోతుంది.
6. బాడీ లోషన్... ముందుగా చేతులను వేడినీటితో బాగా శుభ్రం చేసుకున్న తరువాత నాణ్యమైన బాడీలోషన్ ను మురికి ఎక్కువగా వున్న ప్రదేశాల్లో అప్లై చేసుకోవాలి. చేతిగోళ్లతో మురికి వున్న ప్రదేశాల్లో బాగా రుద్దుకోవాలి. ఇలా చేయడంతో చర్మం మీద వుండే మురికి మటుమాయం అవుతుంది.
7. హాట్ ఆయిల్ మసాజ్... ఈ హాట్ ఆయిల్ మసాజ్ చర్మంలో వుండే మురికిని తీసివేయడమే కాదు.. మానసికంగా ఎంతో ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. ముందుగా గోరువెచ్చగా వుండే నూనెను కొద్దిగా తీసుకుని, మురికి ఎక్కవగా వుండే ప్రదేశాల్లో మసాజ్ చేయాలి. 20 నిముషాల తరువాత చేతిగోళ్లతోగానీ, టవాల్ తోగాని బాగా రుద్దుకోవాలి. కొద్దిసేపయిన తరువాత హాట్ షవర్ చేసుకుంటే.. చర్మం రంధ్రాల్లో వుండే మురికి క్షణాల్లో మాయమయి.. నిగనిగలాడే చర్మాన్ని సొంతం చేసుకుంటారు.
ఇలా ఈ విధంగా ప్రకృతి సహజమైన చిట్కాలను ఉపయోగించి.. చర్మం మీద, రంధ్రాల్లో వుండే మురికిని తొలగించుకుని, నిగారించే అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more