Tips to avoid sunstroke

summer health, sunstroke, sun protection, general health, health

summer health, sunstroke, sun protection, general health, health

వడదెబ్బ నుండి రక్షణ కొరకు

Posted: 05/25/2013 10:04 AM IST
Tips to avoid sunstroke

వడదెబ్బ తగల కుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. వడదెబ్బ తాకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? వడదబ్బ లక్షణాలు ఏమిటి ? వడ దెబ్బ తాకకుండా కొన్ని చిట్కాలు మీ కోసం...
లక్షణాలు

శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, తీవ్ర నీరసం వడదెబ్బ లక్షణాలు. శక్తి కోల్పోయి వాలిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, కళ్లు తిరిగి పడిపోవడం కూడా వడదెబ్బ వల్ల సంభవిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేయాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్ హీట్ దిగువకు వచ్చే వరకూ చల్లటి నీటిలో తడిపిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. వడదెబ్బకు గురైన వారిని తక్షణం వైద్యుల వద్దకు తీసుకెళ్లి, వైద్య సాయమందించాలి.

ఎండలో వెళ్లొద్దు..
వడగాడ్పులను దృష్టిలో పెట్టుకుని ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తప్పనిసరైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లలోనో, కార్యాలయాల్లోనో ఉండాలి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, పిల్లలు ఈ సూచనను విధిగా పాటించాలి. బీపీ మాత్రలు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.

గొడుగు వాడండి..
ఇతరులు కూడా ఎండ వేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వేడి నేరుగా తలపైన, మొఖంపైన పడకుండా తెల్లటి వస్త్రంగానీ, టోపీగానీ, గొడుగుగానీ ధరించాలి. పొలంలో పనిచేసే వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా తలపాగా ధరించాలి.

లేత రంగులు ధరించండి
వేడిని ఆకర్షించని లేత రంగు కాటన్ దుస్తులు ధరిం చడం మంచిది. నల్లటి వస్త్రాలు వేడిని ఆకర్షిస్తాయి. అందువల్ల నల్ల రంగు దుస్తులు ధరించకపోవడం మంచిది.

నీళ్లు తాగండి..
వేసవి నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంచి నీరు తాగాలి. వేడివల్ల చెమట రూపంలో ఎక్కువ నీరు, ఉప్పు బయటకు వెళతాయి. అందువల్ల ఉప్పు కలిపిన నీరు తీసుకోవాలి. ఎండవల్ల పోయే శక్తిని తిరిగి పొందేందుకు, చల్లదనం కోసం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తాగాలి. తాజా పండ్లు తీసుకోవడం మంచిది.

గాలి వచ్చేలా చూసుకోండి
నివాస ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. బాగా గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలకు వట్టి వేళ్ల కర్టెన్లు లేదా గోనె పట్టాలు వేలాడదీసి నీరు చల్లితే చల్లని గాలి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more