Hair fall control aloe vera

aloe vera hair gel, hair fall control aloe vera gel, hair growth aloe vera gel

aloe vera hair gel, hair fall control aloe vera gel, hair growth aloe vera gel

కేశాలకు కలబంద

Posted: 02/12/2013 01:44 PM IST
Hair fall control aloe vera

aloe-vera

అందం జోలికి వెడితే అణువణువూ అలంకరించుకోవలసిందే. నఖశిఖపర్యంతం చేసుకునే అలంకరణ లో జుట్టుకు మగువలు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ప్రస్తుతం జుట్టు కోసం ఎన్నో రకాల షాంపూలు, ఆయిల్స్‌ వాడుతూ వుంటారు. జట్టు ఎలా ఉన్నా డాండ్రఫ్‌ కనుక తల్లో చొరబడిందంటే, నలుగురిలోను తలగోక్కోకుండావుండలేరు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.ఈ డాండ్రఫ్‌ నుంచి బయట పడడానికి ఎన్నో ప్రోడక్ట్స వాడుతుంటారు. అసలు జుట్టు సంరక్షణలో ఇంట్లోనే కొన్ని చిట్కాలు వాడితే సరిపోతుంది. జట్టు విపరీతంగా రాలటం, క్రమంగా తెల్లబడటం లాంటి చికాకులతో బాధ పడేవారికి అలోవేరా (కలబంద) ఆయిల్‌ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనెను ప్రతి రోజూ గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్లకు బాగా పట్టించి మర్దనా చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కలబంద నూనెను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కలబంద నూనె తయారీకి కావలసిన పదార్ధాలు కలబంద గుజ్జు పావు కేజీ, కొబ్బరి నూనె పావు కేజీ.

తయారుచేయడం:

కలబంద మట్టను తీసుకుని దానిని చీల్చి లోప ఉండే గుజ్జునంతటినీ తీసుకోవాలి. అయితే ఈ గుజ్జు ముద్దలుగా లేకుండా చూసుకోవాలి.ఒక బాణలి తీసుకుని స్టౌవ్‌ పై పెట్టి సన్నని సెగపై ఉంచి అందులో కలబంద గుజ్జును వేసి అడుగంట కుండా కలుపుతూ వుండాలి. అలా ఉడికిస్తుంటే నీరంతా ఆవిరైపోయి నూనె మాత్రమే మిగులుతుంది. దాంట్లో మర్వం గానీ, ధవనం గానీ వేసి కలియబెట్టాలి. ఇవి మంచి సువాసననిస్తాయి. అవిలేకుంటే వేయకపోయినా ఇబ్బంది లేదు. ఇక కలబంద నూనె తయారైనట్లే. దీనిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడినట్లయితే జుట్టు రాలటం తగ్గుతుంది. జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఆయిల్‌ రాసుకునే అలవాటు చాలా మందికి వుండదు. అలాంటి వారు వారానికి ఒక సారి కలబంద గుజ్జును మెత్తగా పేస్ట్‌ చేసి దానిని తలకు బాగా పట్టించి మర్ధనా చేస్తే చాలు. జుట్టు రాలడం తగ్గుతుంది. దీనితో పాటు చుండ్రుకూడా నివారింపబడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more