The Historical Story Of Lord Shiva Temple Which Is Located In Sivadevuni Chikkala Village | Telugu Ancient Stories

Sivadevuni chikkala lord shiva temple history telugu ancient stories

Sivadevuni Chikkala temple, lord shiva temples, Sivadevuni Chikkala village, Sivadevuni Chikkala temple history, lord shiva history, Sivadevuni Chikkala temple story

Sivadevuni Chikkala Lord Shiva Temple History Telugu Ancient Stories : The Historical Story Of Lord Shiva Temple Which Is Located In Sivadevuni Chikkala Village. This Temple Has One Speciality.

‘లింగం’ తలభాగం నుంచి చీల్చిబడినట్లుగా వుండే శివుని ఆలయం

Posted: 07/30/2015 04:35 PM IST
Sivadevuni chikkala lord shiva temple history telugu ancient stories

దేశంలో ప్రతిష్టించబడిన శివుని ఆలయాలన్నింటిలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శివదేవుని చిక్కాల గ్రామంలో వుండే ఆలయంలో ఓ ప్రత్యేకత వుంది. ఈ దేవాలయంలో మూడున్నర అడుగుల పొడవు, అడుగు వ్యాసార్ధంతో వున్న లింగం తలభాగం నుండి చీల్చబడినట్లుగా చీలికతో వుంటుంది. ఈ శివాలయం వుండటం వల్లే చిక్కాల గ్రామం బాగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.

స్థలపురాణం :

పూర్వం.. ‘రామాయణ’ కాలంలో లంకతో యుద్దానికి ముందు శివపూజ చేసిన తరువాత లంకకు పయనమైతే మంచిదని పెద్దలు చెప్పగా.. శ్రీరాములు ఆ పూజా కార్యక్రమాలను సిద్ధం చేస్తాడు. అప్పుడు శివలింగంను తీసుకురావాల్సిందిగా హనుమంతునికి శ్రీరాముడు ఆదేశిస్తాడు. తన స్వామి చెప్పడమే ఆలస్యం హనుమంతుడు వెంటనే హిమాలయాల నుండి బయలుదేరుతాడు. ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకొని తిరిగి పయనమవుతాడు.

మార్గమధ్యంలో చిక్కాల ప్రాంతానికి హనుమంతుడు చేరుకునేసరికి సాయంత్రం అవ్వడం వల్ల ‘సంద్యావందనం’ పాటించడానికి ఆ శిలను ‘కాళింది మడుగు’ అనే సరోవరం తీరంలో వుండే ఒక చిన్న గుట్టపైన దించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ శిల చేయిజారి సరస్సులో పడిపోతుంది. దాంతో హనుమంతుడు ఆ సరస్సులో దూకి, జారిపోయిన శిలను వెతికి వెలుపలికి తీస్తాడు. అయితే.. ఆ శిల తల భాగము నుండి సగంవరకు పగిలిపోయి వుండటాన్ని గమనించిన ఆయన.. ఇలా జరిగిందేమని అనుకుని, దానిని ఆ గుట్టపైనే వుంచుడం ఉత్తమమని భావించి ఆ శిలను తలచిన ప్రదేశంలో ప్రతిష్టించాడు. అలా ఆ విధంగా ఆయన ప్రతిష్టించిన ఆ లింగమే శివదేవునిగా పిలువబడుతోంది.

ఇప్పటికీ దాదాపు మూడున్నర అడుగులతో తెలుపు గోధుమ వర్ణాల ఈ శివలింగం అలాగే సగం పగులుతో రెండు ముక్కలుగా కనిపిస్తుంది. దీని ప్రక్కనే ఉన్న కాళింది మడుగులో పెద్ద తాండవ కృష్ణుడి శిల్పం వుంది. చిక్కాలలో ఆ పగిలిన లింగాన్ని ప్రతిష్టించిన తర్వాత హనుమంతుడు మరో శిల కోసం తిరుగు ప్రయాణమయ్యాడు. హనుమ ఎంతకూ తిరిగి రాకపోవడం వల్ల రాముడు ఇసుకతో లింగాన్ని తయారుచేసి.. పూజ పూర్తి చేస్తాడు. అనంతరం హనుమంతుడు తీసుకెళ్ళిన లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sivadevuni Chikkala temple  lord shiva temples  Telugu Ancient Stories  

Other Articles