The Historical Story Of Kukke Subramanya Temple | Hindu Temples in India

Kukke subramanya temple history hindu temples in india

Kukke Subramanya temple, Kukke Subramanya temple history, Kukke Subramanya history, hindu temples in india, kumara swamy temple, kumara swamy biography, kumara swamy history, hindu temples list, Kukke Subramanya, skand purana, telugu puranas

Kukke Subramanya Temple History Hindu Temples In India : The Historical Story Of Kukke Subramanya Temple. This is a Hindu temple located in the village of Subramanya, Karnataka. The epics relate that the divine serpent Vasuki and other serpents found refuge under Subramanya when threatened by the Garuda.

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థలపురాణం

Posted: 06/20/2015 07:49 PM IST
Kukke subramanya temple history hindu temples in india

ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి.  కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.

ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది. పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు. క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.

స్థలపురాణం : పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి (కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో) ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలసింది.

మరిన్ని వివరాలు :

సుబ్రహ్మణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి , మధ్యభాగంలో వాసుకి, కింద్రిభాగంలో ఆదిశేషు ఉంటారు.

ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ‘ఆది శంకరాచార్యులు’ తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ‘నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ’ అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kukke Subramanya  Hindu Temple  Skanda Purana  

Other Articles